Share News

Amruthadhare Serial: ప్రముఖ సీరియల్ నటిపై భర్త కత్తి దాడి

ABN , Publish Date - Jul 11 , 2025 | 01:29 PM

Amruthadhare Serial: రెండు రోజుల క్రితం మునేశ్వర్ లేఅవుట్‌లో ఇళ్లు తీసుకుని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ చేరిన మరుసటి రోజే అమరేష్ దారుణానికి ఒడిగట్టాడు. శృతిపై కత్తితో దాడి చేసి పొడిచాడు. అమరేష్ మొదట శృతి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టాడు.

Amruthadhare Serial: ప్రముఖ సీరియల్ నటిపై భర్త కత్తి దాడి
Amruthadhare Serial

అనుమానాలు హద్దులు దాటుతున్నాయి. కాపురాలు కూలిపోతున్నాయి. తమ పార్ట్‌నర్ తప్పు చేస్తోందన్న అనుమానంతో దారుణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూ పోతోంది. వైవాహిక జీవితంలో దారుణాలకు అనుమానాలే ప్రధాన కారణం అవుతున్నాయి. తాజాగా, ఓ ప్రముఖ సీరియల్ నటిని ఆమె భర్త చంపడానికి చూశాడు. కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమె ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. నటి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు.


సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన శృతి పలు కన్నడ సీరియల్స్‌లో నటించింది. కర్ణాటక వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు కొన్నేళ్ల క్రితం అమరేష్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, శృతి గత కొంతకాలం నుంచి వేరే వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోందని అమరేష్ భావించాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.


ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నెల నుంచి శృతి సోదరుడి ఇంట్లో వచ్చి ఉంటున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత డబ్బుల విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. దీంతో శృతి హనుమంత నగర్ పోలీస్ స్టేషన్‌లో అమరేష్‌పై ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులకే మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు. రెండు రోజుల క్రితం మునేశ్వర్ లేఅవుట్‌లో ఇళ్లు తీసుకుని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అక్కడికి చేరిన మరుసటి రోజే అమరేష్ దారుణానికి ఒడిగట్టాడు.

శృతిపై కత్తితో దాడి చేసి పొడిచాడు. అమరేష్ మొదట శృతి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టాడు. తర్వాత కత్తితో పొట్ట, తొడ, గొంతు భాగాల్లో పలుమార్లు పొడిచాడు. తర్వాత అక్కడినుంచి పారిపోయాడు. పొరిగింటి వాళ్లు శృతిని విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మిస్టరీగా నటి మరణం.. 9 నెలల తర్వాత బయటపడ్డ శవం..

9 మంది ప్రయాణికుల్ని కిడ్నాప్ చేసి, ఆపై హత్య..

Updated Date - Jul 11 , 2025 | 02:50 PM