Share News

Goa Trip With Lovers: లవర్స్‌తో గోవా వెళ్లడానికి యువకుల దొంగతనం.. కట్ చేస్తే..

ABN , Publish Date - Jul 30 , 2025 | 08:42 PM

Goa Trip With Lovers: ముగ్గురికి ప్రియురాళ్లు ఉన్నారు. ప్రియురాళ్లతో కలిసి గోవా వెళ్లాలని, అక్కడ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, లవర్స్‌తో కలిసి గోవా వెళ్లేంత డబ్బుులు వీరి దగ్గర లేదు.

Goa Trip With Lovers: లవర్స్‌తో గోవా వెళ్లడానికి యువకుల దొంగతనం.. కట్ చేస్తే..
Goa Trip With Lovers

ప్రతీ మనిషి జీవితంలో డబ్బు ఎంతటి అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డబ్బు లేకుండా మనిషి జీవితాన్ని ఊహించుకోలేము. అందుకే మనిషిని డబ్బు దిగజార్చినంతగా ఏదీ దిగజార్చలేదు. డబ్బు కోసం మనిషి తనను తాను తాకట్టు పెట్టుకుంటూ ఉంటాడు. మోసాలు చేస్తూ ఉంటాడు. తాజాగా, ఓ ముగ్గురు కాలేజీ విద్యార్థులు.. ప్రియురాళ్లతో గోవా ట్రిప్ వెళ్లడానికి దొంగతనానికి పాల్పడ్డారు. ఆ దొంగతనమే వారి జీవితాలను నాశనం చేసింది. ముగ్గురు పోలీసులకు దొరికిపోయి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.


ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యశ్వంత్, రమేశ్, తనుష్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీకామ్ చదువుతున్నారు. వీరి ముగ్గురికి ప్రియురాళ్లు ఉన్నారు. ప్రియురాళ్లతో కలిసి గోవా వెళ్లాలని, అక్కడ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, లవర్స్‌తో కలిసి గోవా వెళ్లేంత డబ్బుులు వీరి దగ్గర లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ముగ్గురు బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు. దొంగతనం చేయడానికి నిశ్చయించుకున్నారు.


శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేశారు. ఆ ఇంట్లోంచి పెద్ద మొత్తంలో డబ్బు, నగలు దొంగిలించారు. ఆ డబ్బు తీసుకుని ప్రియురాళ్లతో కలిసి గోవా వెళ్లారు. అక్కడ పిచ్చపాటి ఎంజాయ్ చేశారు. ట్రిప్ ముగిసి బెంగళూరుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే కోతాన్‌పూర్ పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి అరకిలో బంగారం.. పది లక్షల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ప్రియురాళ్లతో గోవా ట్రిప్ కోసం చేసిన దొంగతనం కారణంగా ముగ్గురూ జైలు పాలై ఊసలు లెక్కిస్తూ ఉన్నారు.


ఇవి కూడా చదవండి

ఇండియన్స్ అంటే అందరూ భయపడాల్సిందే.. ఈ జుగాడ్ వీడియో చూస్తే షాక్..

పహల్గామ్ ఉగ్రవాదుల హతం.. ఆ రాత్రి అమిత్‌ షా ఏం చేశారంటే..

Updated Date - Jul 30 , 2025 | 09:17 PM