Share News

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్

ABN , Publish Date - May 16 , 2025 | 05:35 PM

దేశంలో పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకుని ఆర్నేళ్లపాటు చెల్లించకపోతే ఏం జరుగుతుంది. ఈ క్రమంలో బ్యాంకులు నోటీసులు మాత్రమే పంపిస్తాయా లేదంటే జైలు శిక్ష కూడా పడుతుందా. రూల్స్ ఏం చెబుతున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్
Personal Loan Not Paying

ఆర్థిక అవసరాల కోసం తీసుకున్న పర్సనల్ లోన్ (Personal Loan) అనుకోని కారణాల వల్ల కట్టకపోతే ఆయా బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థల నుంచి తెగ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఒకవేళ ఆర్నేళ్లపాటు లోన్ ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుంది. బ్యాంకు నోటీసులు మాత్రమే పంపిస్తుందా లేదంటే జైలుకు కూడా పంపించే అవకాశం ఉందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి దాన్ని చెల్లించకపోతే, బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ కొన్ని దశల్లో చర్యలు తీసుకుంటాయి. ఈ ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జరుగుతుంది.


ముందుగా కాల్స్

మీరు ఈఎంఐ (Equated Monthly Installment) చెల్లించడంలో ఒక నెల ఆలస్యం చేస్తే, మీకు బ్యాంకు ఫోన్ కాల్స్, SMS, లేదా ఈ మెయిల్స్ ద్వారా గుర్తుచేస్తారు. ఎందుకు చెల్లించడం లేదని అడుగుతారు. ఈ దశలో బ్యాంకు సాధారణంగా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుంది. మీ సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.

రెండో దశలో రికవరీ ఏజెంట్లు

ఈ క్రమంలో మీరు 3 నుంచి 6 నెలల పాటు చెల్లింపులు చేయకపోతే, బ్యాంకు రికవరీ ఏజెంట్లను రంగంలోకి దించుతుంది. దీంతో ఏజెంట్లు మీ ఇంటికి వచ్చి లేదా ఫోన్ ద్వారా మీతో మాట్లాడతారు. RBI నిబంధనల ప్రకారం, రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో వారు మీపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రవర్తిస్తారు.


మూడో దశలో చట్టపరమైన నోటీసు

ఆరు నెలల తర్వాత కూడా చెల్లింపులు జరగకపోతే, బ్యాంకు చట్టపరమైన నోటీసు పంపిస్తుంది. ఇది సాధారణంగా సివిల్ కేసుగా పరిగణిస్తారు. పర్సనల్ లోన్ అనేది అన్ సెక్యూర్డ్ లోన్. కాబట్టి, బ్యాంకు మీ ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని కల్గి ఉండదు. కానీ మీ ఆదాయం (జీతం లేదా ఇతర మూలాలు) నుంచి రికవరీ చేయడానికి కోర్టు ఆదేశాలను కోరుతుంది.

CIBIL స్కోర్‌పై ప్రభావం

మీరు రుణం చెల్లించకపోతే, మీ CIBIL స్కోర్ తీవ్రంగా దెబ్బతింటుంది. ఉదాహరణకు, 750 ఉండే స్కోర్ 600 లేదా అంతకంటే తక్కువకు పడిపోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మీరు రుణాలు లేదా క్రెడిట్ కార్డులు పొందడం కష్టమవుతుంది. అంతేకాదు ఒకవేళ రుణం పొందినా కూడా వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.


జైలు శిక్ష ఉంటుందా

ఈ క్రమంలో మీరు ఆరు నెలలపాటు రుణం చెల్లించకపోయినా కూడా జైలు శిక్ష ఉండదు. ఎందుకంటే, పర్సనల్ లోన్ చెల్లించకపోవడం అనేది సివిల్ కేసు (Civil Case) కిందకు వస్తుంది, క్రిమినల్ కేసు (Criminal Case) కాదు. బ్యాంకు కోర్టులో కేసు దాఖలు చేస్తే, కోర్టు మీ ఆదాయం లేదా ఆస్తుల నుంచి రుణాన్ని రికవరీ చేయమని ఆదేశించవచ్చు. ఒకవేళ మీరు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే, అప్పుడు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కానీ ఇది చాలా అరుదని చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి

Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..


NRI Money Transfer Tax: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్.. విదేశాలకు మనీ పంపిస్తే బాదుడేనా..


Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 05:47 PM