Good Credit Score Benefits: మంచి క్రెడిట్ స్కోరు ఉంటే బోలేడు ప్రయోజనాలు..లోన్లతోపాటు జాబ్స్ కూడా..
ABN , Publish Date - May 17 , 2025 | 03:07 PM
మీరు లోన్ కోసం అప్లై చేసే క్రమంలో క్రెడిట్ స్కోర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఒక్క లోన్ మాత్రమే కాదు, మంచి క్రెడిట్ స్కోర్ వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పలువురు ఉద్యోగులు లేదా వ్యాపారస్థులు లోన్స్ తీసుకుని సమయానికి చెల్లించడంలో విఫలమవుతుంటారు. దీంతో వారి క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. కానీ మంచి క్రెడిట్ స్కోర్ ఉండటం వల్ల అనేక లాభాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
1. తక్కువ వడ్డీ రేట్లకు లోన్స్
మీ క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) మీకు తక్కువ వడ్డీ రేట్లకు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి 776 స్కోరుతో ఉన్నప్పుడు, ప్రైవేట్ బ్యాంక్ 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఇచ్చి, 8.65% వడ్డీ రేటుతో హోమ్ లోన్ ఇస్తుంది.
2. ప్రీమియం క్రెడిట్ కార్డులు, అధిక క్రెడిట్ లిమిట్లు
మీ క్రెడిట్ స్కోరు 750 పైగా ఉంటే, మీరు ప్రీమియం క్రెడిట్ కార్డులు పొందే అవకాశం ఉంటుంది. ఈ కార్డుల ద్వారా అధిక రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లను తక్కువ వడ్డీ రేట్లకు పొందవచ్చు. అలాగే, బ్యాంకులు మీకు అధిక క్రెడిట్ లిమిట్లను మంజూరు చేస్తాయి. అది మీ ఆర్థిక స్వతంత్రతను పెంచుతుంది.
3. ఇన్సూరెన్స్ ప్రీమియమ్‌లలో తగ్గింపు
ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మీ క్రెడిట్ స్కోరును పరిశీలిస్తాయి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నవారికి తక్కువ ప్రీమియమ్‌లను అందిస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి 800 స్కోరుతో ఉన్నప్పుడు, అతను తన కార్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్‌పై 15% తగ్గింపు పొందుతాడు. ఆ క్రమంలో వార్షికంగా రూ.5,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
4. ఉద్యోగ అవకాశాల్లో..
అన్ని రంగాల్లో కాకపోయినా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాల కోసం అప్లై చేసిన తర్వాత, ఎంపిక చేసే క్రమంలో మీ క్రెడిట్ స్కోరు తప్పకుండా పరిశీలిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి 800పైగా క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు, అతనికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో జాబ్స్ విషయంలో కూడా క్రెడిట్ స్కోర్ కీలకంగా మారుతుందని గుర్తుంచుకోవాలి.
5. నిర్వహణలో సౌలభ్యం..
మంచి క్రెడిట్ స్కోరు ఉన్నప్పుడు, మీరు మీ ఆర్థిక వ్యవహారాలను సులభంగా నిర్వహించుకుంటారు. మీరు తక్కువ వడ్డీ రేట్లతో లోన్‌లను పొందుతారు. ప్రీమియం క్రెడిట్ కార్డులతోపాటు ఇన్సూరెన్స్ ప్రీమియమ్‌లలో తగ్గింపు లభిస్తుంది. ఇది మీ ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి
Intraday Trading: స్టాక్ మార్కెట్ ఇంట్రాడేలో ఎంత మంది నష్టపోతున్నారో తెలుసా..
Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్
Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి