Share News

Top 5 Travel Credit Cards: తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం.. టాప్ 5 క్రెడిట్ కార్డులు ఇవే..

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:29 PM

క్రెడిట్ కార్డ్ ఎంచుకునేటప్పుడు మీ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు మీరు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కువగా చేస్తే ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ ఉన్న క్రెడిట్ కార్డులు తీసుకోవడం మంచిది. అలాంటి టాప్ 5 కార్డుల (Top 5 Travel Credit Cards) గురించి ఇక్కడ చూద్దాం.

Top 5 Travel Credit Cards: తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం.. టాప్ 5 క్రెడిట్ కార్డులు ఇవే..
Top 5 Travel Credit Cards

మీరు తరచుగా దేశ, విదేశాల్లో అనేక ప్రాంతాల్లో ప్రయాణిస్తారా. ఇలాంటి వారికి ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌తో కూడిన క్రెడిట్ కార్డ్ మంచి ఛాయిస్. విమాన ప్రయాణంలో ఎక్కువ సమయం విమానాశ్రయంలో గడపాల్సి వస్తుంది. అలాంటి క్రమంలో ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో విశ్రాంతి తీసుకోవడంతోపాటు ఫ్రీ ఫుడ్ వంటివి మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మారుస్తాయి. అందుకే అనేక మంది క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుదు లాంజ్ యాక్సెస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఖరీదైన ప్రీమియం కార్డులకు బదులుగా, తక్కువ ఖర్చుతో లాంజ్ యాక్సెస్ లభించే టాప్ 5 క్రెడిట్ కార్డుల (Top 5 Travel Credit Cards) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. IDFC FIRST Select క్రెడిట్ కార్డ్

IDFC FIRST Select క్రెడిట్ కార్డ్ తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కార్డ్‌తో ప్రతి త్రైమాసికంలో రెండు ఉచిత డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ సందర్శనలను అందిస్తుంది. కానీ దీని కోసం గత నెలలో కనీసం రూ. 20,000 ఖర్చు చేయాలి. విదేశీ లాండ్రీలలో ఖర్చులకు 1.99% ఫారెక్స్ మార్కప్ ఫీజు వసూలు చేస్తారు. ఈ కార్డ్‌కు జాయినింగ్ లేదా వార్షిక ఫీజు లేదు. దీంతోపాటు ఈ కార్డ్‌తో షాపింగ్, డైనింగ్‌లో ఆకర్షణీయ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి.


2. Tata Neu Infinity HDFC Bank క్రెడిట్ కార్డ్

Tata Neu Infinity HDFC క్రెడిట్ కార్డ్ అంతర్జాతీయ ప్రయాణికులకు మంచి ఛాయిస్. ఈ కార్డ్‌తో సంవత్సరానికి నాలుగు డొమెస్టిక్, ఎనిమిది అంతర్జాతీయ లాంజ్ సందర్శనలు ఉచితంగా పొందవచ్చు. ఈ కార్డ్‌కు జాయినింగ్, రెన్యూవల్ ఫీజు రూ. 1,499గా ఉంది. Tata Neu యాప్‌లో షాపింగ్ చేస్తే అదనపు రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి.

3. Axis Bank ACE క్రెడిట్ కార్డ్

Axis Bank ACE క్రెడిట్ కార్డ్ అందుబాటు ధరలో లాంజ్ యాక్సెస్ అందిస్తుంది. ఈ కార్డ్‌తో సంవత్సరానికి నాలుగు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ సందర్శనలు ఉచితం. అదనంగా, Google Pay ద్వారా బిల్ పేమెంట్లపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ కార్డ్‌కు జాయినింగ్, వార్షిక ఫీజు రూ. 499 మాత్రమే.


4. Kotak Royale Signature క్రెడిట్ కార్డ్

Kotak Royale Signature క్రెడిట్ కార్డ్ ప్రతి త్రైమాసికంలో రెండు ఉచిత డొమెస్టిక్ లాంజ్ సందర్శనలను అందిస్తుంది. రూ. 500 నుంచి రూ. 5,000 మధ్య జరిగే ఇంధన లావాదేవీలపై 1% ఫ్యూయల్ సర్చార్జ్ మినహాయింపు కూడా లభిస్తుంది. ఈ కార్డ్‌కు జాయినింగ్ ఫీజు రూ. 1,499. వార్షిక ఫీజు రూ. 999.

5. HSBC Live+ క్రెడిట్ కార్డ్

HSBC Live+ క్రెడిట్ కార్డ్ సంవత్సరానికి నాలుగు డొమెస్టిక్ లాంజ్ సందర్శనలను అందిస్తుంది. అంటే ప్రతి త్రైమాసికంలో ఒక సందర్శన. ఈ కార్డ్‌కు జాయినింగ్, వార్షిక ఫీజు రూ. 999. కానీ సంవత్సరానికి రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఈ ఫీజు మినహాయించబడుతుంది. ఈ కార్డ్ డైనింగ్, షాపింగ్‌లో అదనపు రివార్డ్‌లను కూడా అందిస్తుంది.


ఇవి కూడా చదవండి

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 04:31 PM