Gold Price Update: బంగారం కొనాలనుకునే వారికి షాక్.. భారీగా పెరిగిన ధరలు..
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:16 PM
శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,23,980 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,13,650 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 18 క్యారెట్ల ధర 92,900 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
బంగారం కొనాలనుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే ఏకంగా పది గ్రాములపై 1800 రూపాయలు పెరిగింది. శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,23,980 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,13,650 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 18 క్యారెట్ల ధర 92,900 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,25,840 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల ధర 1,15,350 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర 94,380 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. 100 గ్రాములపై 300, కేజీపై 3 వేల రూపాయలు పెరిగింది. నిన్న(శుక్రవారం) 100 గ్రాముల వెండి ధర 16,100 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,61,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో 100 గ్రాముల వెండి ధర 16,400 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ ధర 1,64,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు (24 క్యారెట్లు ఒక గ్రాముకు)
హైదరాబాద్‌లో రూ. 17,200
విజయవాడలో రూ. 17,200
ఢిల్లీలో రూ. 16,400
ముంబైలో రూ. 16,400
వడోదరలో రూ. 16,400
కోల్‌కతాలో రూ. 16,400
చెన్నైలో రూ. 17,200
బెంగళూరులో రూ. 16,400
కేరళలో రూ. 17,200
పుణెలో రూ. 17,200
ముఖ్య గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాల్సి ఉంటుందని సూచన.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..