Tesla Showroom: ఇండియాలో షో రూమ్ ఓపెన్ చేసిన టెస్లా.. కార్ల ధర ఎంతంటే..
ABN , Publish Date - Jul 15 , 2025 | 01:51 PM
Tesla Showroom: టెస్లా కార్ల ధరలు ఇండియాలో ఇంత పెద్ద మొత్తంలో ఉండటానికి ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా ఓ కారణం. విదేశీ కార్లపై ఇండియా ఏకంగా 70 నుంచి 100 శాతం ఇంపోర్ట్ టాక్సులు వేస్తోంది.

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల షో రూము ఇండియాలో ఓపెన్ అయింది. ఇండియాలో తొలి షో రూము మంగళవారం ఉదయం ముంబైలోని బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లో ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ షో రూములో వై మోడల్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అమ్మకానికి ఉంచారు. వై మోడల్ కార్లు రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. లాంగ్ రేంజ్ ఆర్‌డబ్ల్యూడీతో పాటు లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ కార్లు మాత్రమే అమ్మకానికి ఉన్నాయి.
ఈ వై మోడల్ కార్లలో.. రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్‌కు సంబంధించిన ధర 59.89 లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది. టెస్లా కార్ల ధరలు ఇండియాలో ఇంత పెద్ద మొత్తంలో ఉండటానికి ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా ఓ కారణం. విదేశీ కార్లపై ఇండియా ఏకంగా 70 నుంచి 100 శాతం ఇంపోర్ట్ టాక్సులు వేస్తోంది. తన కార్లపై ఇండియాలో అధికంగా టాక్సులు వేయటంపై ఎలన్ మస్క్ ఇది వరకే భారత ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. అధిక టాక్సులు తగ్గించాలని కోరారు.
అయితే, భారత ప్రభుత్వం మాత్రం టాక్సుల విషయంలో వెనక్కు తగ్గలేదు. అమెరికానుంచి కార్లను ఇండియాకు ఇంపోర్ట్ చేసే బదులు.. ఇండియాలోనే ఓ యూనిట్ పెట్టి కార్లను ఇక్కడే తయారు చేయాలని చెప్పింది. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి, మస్క్ ఇండియాలో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారో.. లేదో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి
భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది.. అడిగితే కేరళ స్టోరీ చెప్పింది..
ఇండియన్స్ అంటే అంత చిన్న చూపా.. అంత దారుణంగా అంటారా?..