Share News

Tesla: టెస్లాతో మామూలుగా ఉండదు.. ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తాయి..

ABN , Publish Date - Jun 29 , 2025 | 07:08 PM

Tesla: 30 నిమిషాలకు పైగా ఉన్న కారు జర్నీ తాలూకా వీడియోను 3 నిమిషాలకు కుదించి రిలీజ్ చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ స్పందించారు. ‘కాపోవ్’ అని కామెంట్ చేశారు.

Tesla: టెస్లాతో మామూలుగా ఉండదు.. ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తాయి..
Tesla

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల ప్రత్యేకత ఏంటో చాలా మందికి తెలిసే ఉంటుంది. టెస్లా కార్లు డ్రైవర్ లేకుండా ప్రయాణం చేయగలవు. కారులో ప్రయాణించే వారిని గమ్యస్థానానికి చేర్చగలవు. సెల్ఫ్ డ్రైవ్‌లో కూడా ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా గమ్యస్థానానికి చేరడంలో టెస్లా కార్లు రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కొత్త రికార్డు టెస్లా కార్ల సొంతం అయింది. తమ కస్టమర్ల కోసం టెస్లా కంపెనీ అద్భుతమైన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సెల్ఫ్ డ్రైవ్ కార్లను ఇంటికే డెలివరీ చేస్తోంది. కస్టమర్లు ఆర్డర్ ఇస్తే చాలు.. కార్లు వారి ఇంటికి సెల్ఫ్ డ్రైవ్‌లో వచ్చేస్తాయి.


కారు కోసం టెస్లా ఫ్యాక్టరీ వరకు వెళ్లాల్సిన పని లేదు. తాజాగా, టెస్లా కంపెనీకి చెందిన సెల్ఫ్ డ్రైవింగ్ మోడల్ వై విజయవంతంగా కస్టమర్ ఇంటికి డెలివరీ అయింది. టెక్సాస్, ఆస్టిన్‌లోని గిగా ఫ్యాక్టరీ నుంచి కారు ఓ కస్టమర్ ఇంటికి సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. దాదాపు 30 నిమిషాలకు పైగా.. హైవేలు, ట్రాఫిక్ సిగ్నల్స్, వీధులు దాటుకుని కస్టమర్ ఇంటికి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోను టెస్లా కంపెనీ తమ అఫిషియల్ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.


30 నిమిషాలకు పైగా ఉన్న కారు జర్నీ తాలూకా వీడియోను 3 నిమిషాలకు కుదించి రిలీజ్ చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న(శనివారం) వీడియో పోస్ట్ అవ్వగా.. ఒక రోజులోనే 25 మిలియన్లకుపైగా మంది ఆ వీడియోను చూశారు. 72 వేలకు పైగా మంది లైక్ చేశారు. వేల సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి. ఇక, ఈ వీడియోపై టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ స్పందించారు. ‘కాపోవ్’ అని కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి

సిక్స్ కొట్టి పిచ్‌లోనే ప్రాణాలు వదిలిన ఆటగాడు

రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైకుపై బరితెగించి..

Updated Date - Jun 29 , 2025 | 07:09 PM