Tata Dealers : టాటా మోటార్స్ స్టెల్ద్ ఎడిషన్ కార్లు
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:07 AM
టాటా సఫారీ విడుదల చేసి 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సఫారీ, హారియెర్ స్టెల్ద్ ఎడిషన్ కార్లను కంపెనీ విడుదల చేసింది.

ABN AndhraJyothy: టాటా సఫారీ విడుదల చేసి 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సఫారీ, హారియెర్ స్టెల్ద్ ఎడిషన్ కార్లను కంపెనీ విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కార్లు 2700 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. చూపరులను ఇట్టే ఆకట్టుకునే ఈ ప్రీమియం ఎడిషన్ కార్లు విలాసానికి, శక్తికి మారుపేరుగా నిలుస్తాయని కంపెనీ తెలిపింది. డీలర్ల వద్ద, ఆన్‌లైన్‌లోనూ వీటి కోసం తక్షణం బుకింగ్ చేసుకోవచ్చు. ఢిల్లీ మార్కెట్లో హారియెర్ స్టెల్ద్ ఎడిషన్ కారు ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.25.09 లక్షలైతే సఫారీ ఎక్స్ షో రూమ్ ప్రారంభ ధర రూ.25.74 లక్షలు.