Stock Market Closing Bell: కోలుకునేందుకు ట్రై చేసి నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
ABN , Publish Date - Apr 07 , 2025 | 03:49 PM
ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలైపోతే, మన మార్కెట్లు కూడా వాటి ప్రభావానికి దారుణంగా పడిపోయి, ఇవాళ రోజంతా కోలుకునేందుకు ట్రై చేశాయి. చివరికి..

Stock Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ(సోమవారం) వారం ఆరంభంలో భారీ నష్టాలతో ప్రారంభమై నష్టాలతోనే ముగిశాయి. ఈ ఉదయం ప్రారంభమే దారుణంగా పడిపోయి స్టార్ అయిన మార్కెట్లు ఇవాళ అంతా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఇండెక్సులు కోలుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాయి. అయితే, బ్యాంక్ నిఫ్టీ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోవడం నేటి ట్రేడింగ్ లో విశేషం.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మార్కెట్ ముగిసే సమయానికి ఇవాళ సెన్సెక్స్ (Sensex) 2226.79.67 పాయింట్లు(2.95 శాతం), నిఫ్టీ (Nifty) 742.85 పాయింట్లు (3.24శాతం) బ్యాంక్ నిఫ్టీ 1642.60(3.19శాతం)కోల్పోయాయి. అటు ఆసియా మార్కెట్లు ఏమాత్రం కోలుకోకుండా భారీ నష్టాల్లో ముగిశాయి. జపాన్ నిక్కీ భారీగా 2598.57 పాయింట్లు అంటే 8.34 శాతం నష్టంతో ముగియగా, హాంకాంగ్ హాంగె సెంగ్ ఏకంగా 3021.53 పాయింట్లు కోల్పోయి 15.24 శాతం నష్టంతో ముగిసింది. ఇక, అమెరికా మార్కెట్ల సంగతి సరేసరి.. అదే పంథాలో వెనక్కిపోతున్నాయి అగ్రరాజ్యం సూచీలన్నీ.
ఇవి కూడా చదవండి..