Share News

Gold: వాళ్లు కొంటున్న బంగారం చూస్తే అబ్బురపడాల్సిందే.. నెలలో 39 వేల కిలోలు

ABN , Publish Date - Nov 06 , 2025 | 09:26 AM

దేశంలో 10 గ్రాముల బంగారం ధర 1.32 లక్షలకు చేరింది. ఎందుకిలా బంగారం ధర పైపైకి పోతోందంటే.. కొందరు వేల కిలోల బంగారం కొంటున్నారు. ఒక్క నెలలోనే ఏకంగా 39,000 కిలోలు అంటే, 39 టన్నుల బంగారం కొన్నారు.

Gold: వాళ్లు కొంటున్న బంగారం చూస్తే అబ్బురపడాల్సిందే.. నెలలో 39 వేల కిలోలు
Gold Buying Soars

Gold-Banks: బంగారం ధరలు ఇటీవలి కాలంలో చుక్కలనంటుతున్నాయి కదా.. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ మేలిమి బంగారం ధర 4379 డాలర్ల స్థాయికి చేరడం. ఇక దేశంలో10 గ్రాముల బంగారం ధర 1.32 లక్షలకు చేరింది. ఎందుకిలా బంగారం ధర పైపైకి పోతోంది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతీ వినియోగదారుని మీదా ఉంది.


దేశంలో బంగారం ధర బాగా పెరిగిపోవడానికి ఒక కారణం పండుగల సీజన్ అయితే, మెయిన్ రీజన్.. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనడం. ఈ ఏడాది 2025, సెప్టెంబర్ నెలలోనూ వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగానే బంగారం కొన్నాయి. ఒక్క నెలలోనే ఏకంగా 39,000 కిలోలు అంటే, 39 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి.


ఈ మేరకు ప్రపంచ స్వర్ణ మండలి(World Gold Council) నివేదిక విడుదల చేసింది. ఇలా ఉంటే, ఈ ఏడాది మొత్తంలో చూసుకుంటే ఒక నెలలో కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇంత అత్యధికంగా ఉండడం ఇదే తొలిసారని డబ్ల్యూజీసీ పేర్కొంది. 2025లో ఇప్పటి వరకూ మొత్తం 634 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు తెలిపింది.


సెప్టెంబర్ నెలలో ఏ బ్యాంకు ఎంత మొత్తం బంగారం కొనుగోలు చేశాయనే విషయానికొస్తే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ అత్యధికంగా 15 టన్నులు, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజగిస్థాన్ 8 టన్నులు, బ్యాంక్ ఆఫ్ గ్వాటిమాలా 6000 కిలోలు, రష్యా కేంద్ర బ్యాంక్ 3 టన్నులు, టర్కీ (తుర్కియే) 2 టన్నుల చొప్పున బంగారం కొన్నాయి. అటు, వడ్డీ వ్యాపారం చేసే బ్యాంకులు కూడా బంగారంపై పెట్టుబడులు భవిష్యత్ లో మంచి ఫలితాల్ని ఇస్తాయని భావిస్తుండటమే దీనికి కారణం.


ఇవి కూడా చదవండి:

Agriculture Minister: పరిహారమిచ్చినా ధాన్యం కొంటాం

AP High Court: స్టాండింగ్‌ కౌన్సిళ్ల నియామకం

Updated Date - Nov 06 , 2025 | 10:07 AM