Stock Market: లాభాల బాటలో సూచీలు.. ఈ రోజు లాభాల్లో ఉన్న టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Aug 04 , 2025 | 10:26 AM
కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండడంతో సూచీలు లాభాల బాటలో ఉన్నాయి. భారత్‌పై ట్రంప్ పన్నుల ఎఫెక్ట్, అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి

గత వారం వరుసగా నష్టాలను చివచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని కాస్త సానుకూలంగా ప్రారంభించాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండడంతో సూచీలు లాభాల బాటలో ఉన్నాయి. భారత్‌పై ట్రంప్ పన్నుల ఎఫెక్ట్, అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి (Business News).
గత శుక్రవారం ముగింపు (80, 599)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత లాభాలను ఆర్జించింది. ఒక దశలో దాదాపు 300 పాయింట్లు ఎగబాకి 80, 902 వద్ద గరిష్టానికి చేరింది. ప్రస్తుతం ఉదయం 10:20 గంటల సమయంలో సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 80, 742 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 70 పాయింట్ల లాభంతో 24, 635 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో యూపీఎల్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, డెలివరీ, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్, సెయిల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, ఏబీబీ ఇండియా, నువమా వెల్త్, గోద్రేజ్ కన్స్యూమర్, సీమన్స్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 316 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.36గా ఉంది.
ఇవి కూడా చదవండి
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి