Stock Market: వరుస నష్టాలకు బ్రేక్.. 450 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:14 PM
గత మూడు సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం లాభాలను ఆర్జించాయి. ఇటీవల వరుస నష్టాల కారణంగా ఐటీ, మెటల్, రియాల్టీ సెక్టార్లు ఆశావహంగా కనిపించడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా సూచీలు లాభాలను ఆర్జించాయి.

గత మూడు సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం లాభాలను ఆర్జించాయి. ఇటీవల వరుస నష్టాల కారణంగా ఐటీ, మెటల్, రియాల్టీ సెక్టార్లు ఆశావహంగా కనిపించడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా సూచీలు లాభాలను ఆర్జించాయి. పలు ఆసియా సూచీలు కూడా లాభాల్లో కొనసాగడం కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి (Business News).
సోమవారం ముగింపు (80, 891)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం నష్టాలతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే కదలాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్ పుంజుకుంది. ఇంట్రాడే కనిష్టం అయిన 80, 575 నుంచి దాదాపు వెయ్యి పాయింట్లు ఎగబాకి 81, 429 వద్ద గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 446 పాయింట్ల లాభంతో 81, 337 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడించింది. చివరకు 140 పాయింట్ల లాభంతో 24, 821 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో టాటా కెమికల్స్, బిర్లాసాఫ్ట్, గ్రాన్యుయల్స్ ఇండియా, వరుణ్ బేవరేజెస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభాలు ఆర్జించాయి. ఐఈఎక్స్, పెట్రోనాట్ ఎల్‌ఎన్‌జీ, మాజగాన్ డాక్, కేఫిన్ టెక్నాలజీస్, పేటీఎమ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 465 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 137 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.81గా ఉంది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై ఏసీసీ క్లారిటీ..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి