Stock Market: సూచీలకు స్వల్ప లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:10 PM
భారీ నష్టాల నుంచి కోలుకుని మంగళవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. రోజంతా లాభనష్టాలతో దోబూచులాడి చివరకు మిశ్రమంగా రోజును ముగించాయి.

భారీ నష్టాల నుంచి కోలుకుని మంగళవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. రోజంతా లాభనష్టాలతో దోబూచులాడి చివరకు మిశ్రమంగా రోజును ముగించాయి. పలు సంస్థలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో రోజును ముగించాయి (Business News).
మంగళవారం ముగింపు (81, 337)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభనష్టాలతో దోబూచులాడింది. మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి ప్రవేశించింది. బుధవారం సెన్సెక్స్ 81,187-81,618 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 143 పాయింట్ల లాభంతో 81, 481 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడించింది. చివరకు 33 పాయింట్ల లాభంతో 24, 855 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో అవెన్యూ సూపర్ మార్కెట్, కేపీఐటీ టెక్నాలజీస్, ఏపీఎల్ అపోలో, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు లాభాలు ఆర్జించాయి. మదర్సన్, టాటా మోటార్స్, లారస్ ల్యాబ్స్, డెలివరీ, బంధన్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 42 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 71 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.42గా ఉంది.
ఇవి కూడా చదవండి
రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి