Stock Market: అమెరికా పన్నుల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు..
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:08 PM
ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి భారత దిగుమతులపై 25 శాతం పన్నులతో పాటు జరిమానా కూడా విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలను చవిచూశాయి. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి.

ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి భారత దిగుమతులపై 25 శాతం పన్నులతో పాటు జరిమానా కూడా విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలను చవిచూశాయి. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి. మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకుని లాభాల్లోకి వచ్చినప్పటికీ తిరిగి నష్టాల్లోకి జారిపోయింది. చివరకు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో రోజును ముగించాయి (Business News).
బుధవారం ముగింపు (81, 481)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 700 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభనష్టాలతో దోబూచులాడింది. మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి ప్రవేశించింది. ఇంట్రాడే కనిష్టం అయిన 80, 695 నుంచి ఒక దశలో ఏకంగా 1100 పాయింట్లకు పైగా లాభపడి 81, 803 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరి గంటల్లో మళ్లీ నష్టాల బాట పట్టింది. చివరకు సెన్సెక్స్ 296 పాయింట్ల నష్టంతో 81, 185 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడించింది. చివరకు 86 పాయింట్ల నష్టంతో 24, 768 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో కేన్స్ టెక్నాలజీస్, డెలివరీ, గోద్రేజ్ కన్స్యూమర్, హెచ్‌యూఎల్, ఏబీ క్యాపిటల్ షేర్లు లాభాలు ఆర్జించాయి. హిందుస్థాన్ కాపర్, ఆర్తి ఇండస్ట్రీస్, బిర్లాసాఫ్ట్, ఇండస్ టవర్స్, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 541 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 188 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.59గా ఉంది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి