Share News

Stock Market: సూచీలకు భారీ నష్టాలు.. 570 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..

ABN , Publish Date - Jul 28 , 2025 | 04:00 PM

విదేశీ మదుపర్లు అమ్మకాలకు పాల్పడుతుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నష్టాలు దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపించాయి. గత శుక్రవారం విదేశీ మదుపర్లు 1976 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించడం నెగిటివ్‌గా మారింది.

Stock Market: సూచీలకు భారీ నష్టాలు.. 570 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..
Stock Market

విదేశీ మదుపర్లు అమ్మకాలకు పాల్పడుతుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నష్టాలు దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపించాయి. గత శుక్రవారం విదేశీ మదుపర్లు 1976 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించడం నెగిటివ్‌గా మారింది. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ ఆలస్యం అవుతుండడం కూడా మదుపర్లను కలవరపెడుతోంది. అలాగే పలు కంపెనీలు వెలువరిస్తున్న త్రైమాసిక ఫలితాల నిరాశజనకంగా ఉండడంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. (Business News).


గత శుక్రవారం ముగింపు (81, 463)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం నష్టాలతో మొదలైన సెన్సెక్స్ ఉదయం కాసేపు లాభనష్టాలతో దోబూచులాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్ కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్ 572 పాయింట్ల నష్టంతో 80, 891 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడించింది. చివరకు 156 పాయింట్ల నష్టంతో 24, 680 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో లారస్ ల్యాబ్స్, ఎంపసిస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, శ్రీరామ్ ఫైనాన్స్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభాలు ఆర్జించాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, లోథా డెవలపర్స్, ఎస్బీఐ కార్డ్, సీడీఎస్‌ఎల్, గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 490 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 444 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.67గా ఉంది.


ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 04:00 PM