Share News

Stock Market: సూచీలకు భారీ నష్టాలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఏవంటే..

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:01 PM

యూకే-భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ అంతార్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో ఈ వారాన్ని సూచీలు నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలను చవిచూశాయి.

Stock Market: సూచీలకు భారీ నష్టాలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఏవంటే..
Stock Market

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపించాయి. యూకే-భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ అంతార్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో ఈ వారాన్ని సూచీలు నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలను చవిచూశాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. (Business News).


గురువారం ముగింపు (82, 184)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం నష్టాలతోనే మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 721 పాయింట్ల నష్టంతో 81, 463 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 225 పాయింట్ల నష్టంతో 24, 837 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో ఐఈఎక్స్, ఫియోనిక్స్ మిల్స్, సిప్లా, టొరెంట్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాలు ఆర్జించాయి. ఏపీఎల్ అపోలో, యూనియన్ బ్యాంక్, కేఫిన్ టెక్నాలజీస్, హిందుస్తాన్ కాఫర్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 951 పాయింట్ల కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 537 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.52గా ఉంది.


ఇవి కూడా చదవండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 04:01 PM