Silver Rate Today: షాకిచ్చిన వెండి.. ఒక్కరోజే రూ.3 వేలు పెరుగుదల
ABN , Publish Date - Jun 06 , 2025 | 09:31 PM
దేశంలో వెండి, బంగారం ధరల మధ్య పోటీ పెరిగింది. ఈ రేట్ల పెరుగుదల విషయంలో నేనంటే నేనని పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు (జూన్ 6, 2025న) వెండి ధరలు (Silver Rate Today) ఏకంగా రూ.3 వేలు పెరిగి ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి.

దేశంలో వెండి ధరలు, బంగారం రేట్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో రోజురోజుకు వీటి ధరలు (Silver Rate Today) పైపైకి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 6, 2025న సిల్వర్ రేట్లు రూ.3 వేలు పెరిగి ఆల్ టైం గరిష్టానికి (రూ.1,07,000) చేరుకున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్‌లో వెండి ధరలు ఏకంగా రూ.4 వేలు పెరిగి కిలోకు రూ.1,18,000కు చేరుకున్నాయి. దీనికి ముందు రోజైన గురువారం రూ.2 వేలు పెరగడం విశేషం.
కారణాలివేనా..
వాణిజ్య రంగంలో గందరగోళం, గ్లోబల్ ఆర్థిక స్థితిపై అనిశ్చితి, అంతర్జాతీయంగా బంగారం ధరలలో మార్పులు ఇవన్నీ సిల్వర్ధ రల పెరుగుదలకు ముఖ్య కారణాలని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో దేశీయ మార్కెట్‌లో కూడా వీటి ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఈ వృద్ధి మార్కెట్‌లోని కొత్త పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలను, అలాగే వినియోగదారుల కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపించింది. ప్రస్తుతం ఈ కారణంగా ఒకేసారి వెండిని కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య తగ్గిపోనుందని వ్యాపారులు చెబుతున్నారు.
ఇతర ప్రాంతాల్లో కూడా..
రాజధానిలోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వెండి ధరలు పుంజుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జ్యువెలరీ సహా ఇతర ఉత్పత్తుల విక్రయాలు కొంత మధ్య స్థాయిలో ఉన్నప్పటికీ, వెండి కొనుగోళ్లు మాత్రం అంచనాలకు మించి పోయాయని వ్యాపారులు అంటున్నారు. హైదరాబాద్‌లో వెండి ధరల పెరుగుదల వాణిజ్య కార్యకలాపాలకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది. ధరల పెరుగుదల వల్ల, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు తమ ఆర్ధిక స్థితిని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు భవిష్యత్తులో వీటి ధరలు తగ్గుతాయని పలువురు అంటుండగా, మరికొంత మంది మాత్రం ఇంకా పెరుగుతాయని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
భారతదేశంలో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సేవలకు లైసెన్స్
ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..