GST on Machinery Sale: క్యాపిటల్ గూడ్స్ అమ్ముతుంటే
ABN , Publish Date - Jun 01 , 2025 | 02:44 AM
క్యాపిటల్ గూడ్స్ (యంత్రాలు) అమ్మేటప్పుడు గడచిన కాలం ఆధారంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ను ఎంత మేరకు రివర్స్ చేయాలో జీఎస్‌టీ నిబంధనలు నిర్ణయిస్తాయి. త్రైమాసికాలు లేదా నెలల ఆధారంగా లెక్కించి అవసరమైన పన్నును చెల్లించాలి.

చాలా రకాల పరిశ్రమల్లో యంత్ర సామాగ్రిని తరచుగా మార్చాల్సిన అవసరం వస్తుంది. దీనికి కారణాలు అనేకం. ఉదాహరణకు టెక్స్‌టైల్ వంటి పరిశ్రమలో వాడే మగ్గాలు, రంగులు అద్దె ఇతర సామాగ్రి తొందరగా అరిగిపోవటంతో వాటిని మార్చాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పాత యంత్రాలను అమ్ముతుంటారు. మరి వీటి మీద జీఎస్‌టీ ఎలా చెల్లించాలి?
ఈ యంత్రాలను లేదా యంత్ర పరికరాలను అంటే మెషిన్ లేదా మిషనరీ మొదలైన వాటిని జీఎ్‌సటీ పరిబాషలో క్యాపిటల్ గూడ్స్ అంటారు. అంటే, ఏ వస్తువులను అయితే తమ అకౌంట్స్‌లో క్యాపిటలైజ్ చేస్తారో వాటిని క్యాపిటల్ గూడ్స్‌గా వ్యవహరిస్తారు. మరి ఈ క్యాపిటల్ గూడ్స్‌ను తిరిగి అమ్మినప్పుడు జీఎ్‌సటీ చెల్లించటానికి ఒక విధానం ఉంది. ఉదాహరణకు ఒక పరిశ్రమ ఒక యంత్రాన్ని లేదా క్యాపిటల్ గూడ్స్‌ను కొనుగోలు చేసినప్పుడు వాటి మీద చెల్లించిన జీఎ్‌సటీని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కింద తీసుకోవచ్చు. ఈ క్యాపిటల్ గూడ్స్ జీవిత కాలం జీఎస్‌టీ కింద 20 త్రైమాసికాలుగా నిర్ధారించారు. అంటే, కనీసం 5 సంవత్సరాలు ఆయా వస్తువులను వాడితేనే దానికి సంబంధించి తీసుకున్న ఐటీసీ మొత్తానికి అర్హత లభిస్తుంది. లేదంటే ఎంత కాలమైతే వాడారో అంతమేరకే అర్హత ఉంటుంది. మిగతాది రివర్స్ చేయాల్సి ఉంటుంది.
దీన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక కంపెనీ తన పరిశ్రమ కోసం కొన్ని యంత్రాలను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.2 లక్షలు. కాగా దీని మీద 18 శాతం చొప్పున రూ.36,000 తీసుకోవటం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్వాయిస్ 2002 జనవరి 1న పొందటం జరిగింది. ఈ యంత్రాలను తిరిగి 2023 సెప్టెంబరు 15న అమ్మారనుకుందాం. అప్పుడు ఆ కంపెనీ ఆ యంత్రాలను 6 త్రైమాసికాల రెండు నెలల పైచిలుకు వాడినట్లు అర్ధం. సంబంధిత నియమం ప్రకారం ఒక త్రైమాసికం దాటి ఒక్క రోజు గడిచినా తదుపరి త్రైమాసికం కింద లెక్కించాలి. కాబట్టి సదరు యంత్రాలను 7 త్రైమాసికాల పాటు వాడినట్లు భావించాలి.
మొత్తం జీవిత కాలం 20 త్రైమాసికాలు కాబట్టి మిగిలిన 13 త్రైమాసికాలకు సరిపోను క్రెడిట్‌ను అర్హత లేనిదిగా భావించాలి. ఆ విధంగా లెక్కిస్తే రివర్స్ చేయాల్సిన మొత్తం రూ.23,400 అవుతుంది (36,000 ్ఠ 13/20). ఇప్పుడు ఆ యంత్రాల వాస్తవ అమ్మకపు విలువ రూ.1,40,000 అనుకుందాం. దీని మీద 18 శాతం జీఎ్‌సటీ లెక్కిస్తే పన్ను విలువ రూ.25,200 అవుతుంది. అంటే రివర్స్ చేయాల్సిన మొత్తం కంటే పన్ను విలువ ఎక్కువ ఉంది. కాబట్టి ఎక్కువ ఉన్న విలువ చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకుండా ఒకవేళ ఆ యంత్రాల అమ్మకపు విలువ రూ.లక్ష అనుకుందాం. అప్పుడు చెల్లించాల్సిన పన్ను రూ.18,000 మాత్రమే అవుతుంది. ఇలాంటి సందర్భంలో రివర్స్ చేయాల్సిన మొత్తం అంటే రూ.23,400 ఎక్కువ కనుక ఆ మొత్తం పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇన్వాయి్‌సలో యధార్ధ అమ్మకపు విలువ దానికి సంబంధించిన పన్ను మాత్రమే చూపాలి. అలాగే కొనుగోలుదారుడు కూడా ఇన్వాయిస్ చూపిన పన్నునే క్రెడిట్ కింద తీసుకోవాలి. అంటే మొదటి ఉదాహరణలో ఎలాగు చెల్లించాల్సిన పన్ను విలువే (ఇన్వాయిస్ ప్రకారం) ఎక్కువ ఉంది కాబట్టి ఎలాంటి సమస్య లేదు. రెండో ఉదాహరణలో ఇన్వాయిస్ చూపేది రూ.18,000 కాగా చెల్లించాల్సింది రూ.23,400. కాబట్టి జీఎస్‌టీఆర్-1లో ఇన్వాయిస్ విలువ రూ.1,00,000, పన్ను కింద రూ.18,000 చూపాలి. అంటే యధార్ధ విలువే చూపించాలి. కాగా, వ్యత్యాసం ఉన్న రూ.5,400 జీఎ్‌సటీఆర్-3బీ లో రివర్సల్ కాలమ్‌లో చూపాలి.
అయితే ఇక్కడ మరొక విషయం ఉంది. ఈ రివర్స్ చేసే విషయంలో త్రైమాసికాల బదులు నెలలను పరిగణనలోకి తీసుకోవాలని జీఎ్‌సటీలోని మరొక నిబంధన తెలుపుతుంది. అంటే 20 త్రైమాసికాల బదులు 60 నెలలను తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నా జీవితకాలం 5 సంవత్సరాలే వస్తుంది. కానీ, రివర్స్ చేయాల్సిన మొత్తంలో కొద్దిగా మార్పు ఉంటుంది. పై ఉదాహరణే నెలల ప్రకారం తీసుకుంటే, యంత్రాలను 20 నెలల పైచిలుకు అంటే 21 నెలల తర్వాత అమ్మినట్లు. కనుక 60 నెలల్లో మిగిలిన 39 నెలలకు సరిపోను క్రెడిట్‌ను లెక్కించాలి. ఈ ఉదాహరణలో ఈ విధంగా లెక్కించినా రివర్స్ చేయాల్సిన మొత్తం రూ.23,400 వస్తుంది కాబట్టి ఎలాంటి సమస్య లేదు. కానీ, కొన్ని సందర్భాల్లో నెలవారీ విధానంలో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు 2023 సెప్టెంబరు బదులుగా ఆగస్టు లేదా జూలై నెలలో యంత్రాలను అమ్మి ఉంటే త్రైమాసిక విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ, నెలవారీ విధానంలో ఎక్కువ రివర్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్యాపిటల్ గూడ్స్ అమ్మేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ కొనుగోలు సమయంలో ఎలాంటి ఐటీసీ తీసుకోకుంటే ఈ రెండు విధానాలను పాటించాల్సిన అవసరం లేదు. ఇన్వాయిస్ ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.