Rs.1 Visa Offer: ఒక్క రూపాయికే వీసా.. ఆ పదిహేను దేశాలకు సులభంగా వెళ్లి రావొచ్చు..
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:26 PM
మీకు ప్రయాణాలంటే ఇష్టమా? మీరు పలు దేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? వీసాలు దొరకవేమో అని అనుమానపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ బంపరాఫర్. విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు అట్లీస్ సంస్థ శుభవార్త తెలిపింది.

మీకు ప్రయాణాలంటే (Travelling) ఇష్టమా? మీరు పలు దేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? వీసా (Visa) దొరకదేమో అని అనుమానపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ బంపరాఫర్. విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు అట్లీస్ (Atlys) సంస్థ శుభవార్త తెలిపింది.టెక్నాలజీ ఆధారిత వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అట్లీస్ సంస్థ కేవలం ఒక్క రూపాయికే వీసా అందిస్తామని వెల్లడించింది. ఈ బంపరాఫర్‌ను ట్రావెల్ లవర్స్ ఉపయోగించుకోవాలని సదరు సంస్థ కోరుకుంటోంది (Rs.1 Visa Offer).
'అట్లీస్ వన్ వే అవుట్' అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ వీసా సేల్‌లో భారతీయులకు 15కు పైగా దేశాలకు వీసా లభిస్తుంది. అది కూడా కేవలం రూపాయికే వీసా లభించనుంది. అయితే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ఆగస్టు 4, 5 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆయా తేదీల్లో అట్లీస్ వెబ్‌సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. తాజా ఆఫర్ ప్రకారం భారతీయులు.. యూఏఈ, యూకే, వియత్నాం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, హాంకాంగ్, జార్జియా, ఒమన్, మొరాకో, ఖతర్, కెన్యా, తైవాన్‌లలో ఏ దేశ వీసా కోసమైనా సరే ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుంది.
ఆగస్టు 4, 5 తేదీల్లో వీసా కోసం అట్లీస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేయగానే ఈ ఆఫర్ దానంతట అదే వర్తిస్తుంది. ప్రాసెసింగ్ కేంద్రం వద్ద మాత్రం కాన్సులేట్, బయోమెట్రిక్ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. పాస్ట్‌పోర్ట్ ఉంటే పై పదిహేనే దేశాల్లో ఏదో ఒక దేశానికి వెళ్లడానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆగస్టు 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 5వ తేదీ రాత్రి 12 గంటలకు వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మీరు వెళ్తున్న దేశాన్ని బట్టి ఆయా ఎంబసీలు విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి