RBI: డిజిటల్ చెల్లింపుల మోసాల కట్టడికి డీపీఐపీ
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:26 AM
నానాటికీ పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలను నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పర్యవేక్షణ, మార్గదర్శకంలో ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిజిటల్ చెల్లింపుల నిఘా వేదిక (డీపీఐపీ) అభివృద్ధి చేయనున్నాయి.

ఆర్‌బీఐ సారథ్యంలో ప్రత్యేక ప్లాట్‌ఫామ్
న్యూఢిల్లీ: నానాటికీ పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలను నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పర్యవేక్షణ, మార్గదర్శకంలో ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిజిటల్ చెల్లింపుల నిఘా వేదిక (డీపీఐపీ) అభివృద్ధి చేయనున్నాయి. వాస్తవికత ఆధారిత నిఘా నివేదికలు పంచుకోవడం, సేకరించడం ద్వారా ఈ వేదిక మోసపూరిత లావాదేవీలకు అడ్డుకట్ట వేస్తుంది. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ను ఉత్తేజితం చేస్తుంది. ఇందుకు సంబంధించిన సంస్థాగత నిర్మాణాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు చేపడతాయి. ఈ వ్యవస్థ నిర్మాణంపై చర్చించేందుకు ఈ నెల ప్రారంభంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటు ఆర్‌బీఐకి, అటు ప్రభుత్వానికి అగ్రప్రాధాన్యంలో ఉన్న అంశం కావడం వల్ల రాబోయే కొద్ది నెలల్లో ఈ వేదిక పని చేయడం ప్రారంభిస్తుందంటున్నారు. 5 నుంచి 10 బ్యాంకులను సంప్రదించి డీపీఐపీ నమూనా తయారుచేసే పని ఆర్‌బీఐ ఇన్నోవేషన్ హబ్‌కు (ఆర్‌బీఐహెచ్) అప్పగించారు.