Share News

Bank of Maharashtra: బీఓఎం లాభంలో 23 శాతం వృద్ధి

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:03 AM

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మార్చితో ముగిసిన క్యూ4లో రూ.1,493 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.గత ఏడాదితో పోల్చితే ఇది 23 శాతం వృద్ధిగా నమోదైంది

Bank of Maharashtra: బీఓఎం లాభంలో 23 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం).. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో రూ.1,493 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.1,218 కోట్లు)తో పోల్చితే లాభం 23 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసిక కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.6,488 కోట్ల నుంచి రూ.7,711 కోట్లకు పెరిగింది. స్థూల ఎన్‌పీఏ లు 1.74 శాతం, నికర ఎన్‌పీఏలు 0.18 శాతంగా ఉన్నాయి.

Updated Date - Apr 26 , 2025 | 04:05 AM