PM Kisan 20th Installment Date: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత రిలీజ్ తేదీ అప్‌డేట్
ABN , Publish Date - Jul 02 , 2025 | 09:27 PM
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత మొత్తం ఇంకా విడుదల కాలేదు. కోట్లాది మంది రైతులు దీని కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా (PM Kisan 20th Installment Date) దీని గురించి కీలక సమాచారం తెలిసింది.

దేశంలో కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan Samman Nidhi Yojana) 20వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్కీం ద్వారా రైతులకు సంవత్సరానికి మూడు విడతలలో రూ. 6,000 (ప్రతి విడత రూ. 2,000) నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. అయితే, 20వ విడత ఇంకా విడుదల కాలేదు. దీనిపై తాజాగా ఓ సమాచారం (PM Kisan 20th Installment Date) వెలుగులోకి వచ్చింది.
20వ విడత ఎప్పుడు..
వ్యవసాయ మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం, PM కిసాన్ యోజన 20వ విడత జూలై 10, 2025 తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఖచ్చితమైన తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం జూలై 2 నుంచి జూలై 9 వరకు ఘనా, ట్రినిడాడ్-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలలో పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో బ్రిక్స్ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాతే ఈ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
e-KYC పూర్తి చేయడం తప్పనిసరి
ఈ విడత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. గతంలో విడుదలైన 19 విడతలు రైతులకు ఆర్థిక ఊతం అందించాయి. ఈ క్రమంలో ఈ 20వ విడత కోసం కూడా రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 20వ విడత సజావుగా అందుకోవాలంటే, రైతులు తమ e-KYC ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. e-KYC చేయని రైతుల ఖాతాల్లో ఈ విడత నగదు జమ కాదు.
e-KYC పూర్తి చేయడానికి రైతులు కింది విధంగా చేయాలి
OTP-ఆధారిత e-KYC: మీ ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే, PM కిసాన్ పోర్టల్ (pmkisan.gov.in) లేదా మొబైల్ యాప్ ద్వారా OTP ఉపయోగించి e-KYC పూర్తి చేయవచ్చు.
బయోమెట్రిక్ e-KYC: సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి, వేలిముద్ర ద్వారా e-KYC పూర్తి చేయవచ్చు.
ఫేస్ ఆథెంటికేషన్: వృద్ధాప్య రైతులు లేదా శారీరక వైకల్యం ఉన్నవారి కోసం CSC కేంద్రాలలో ఫేస్ ఆథెంటికేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి
ఆధార్-బ్యాంకు లింక్: మీ బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. లేకపోతే, బ్యాంకులో లేదా ఆన్‌లైన్‌లో దీన్ని అప్‌డేట్ చేయండి
బెనిఫిషియరీ లిస్ట్: మీ పేరు PM కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్‌లో ఉందో లేదో పోర్టల్‌లో చెక్ చేయండి. లేకపోతే, అప్‌డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ ఆప్షన్ ద్వారా మీ వివరాలను అప్‌డేట్ చేసుకోండి.
మొబైల్ నంబర్ అప్‌డేట్: మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ కానీ పక్షంలో, CSC కేంద్రంలో దీనిని అప్‌డేట్ చేయండి.
PM కిసాన్ యోజన
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీం ఆధ్వర్యంలో చిన్న, సన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం 2019లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 19 విడతలు విజయవంతంగా విడుదలయ్యాయి. ఈ మొత్తం రైతులకు వ్యవసాయ ఖర్చులను తగ్గించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి