Share News

New Rules from June 1st: క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

ABN , Publish Date - May 31 , 2025 | 12:36 PM

కొత్త నెల జూన్ 2025 వచ్చేసింది. కొత్త ఆర్థిక నిబంధనలను తెచ్చింది. ఈ నెలలో రానున్న మార్పుల (New Rules from June 1st) గురించి తెలుసుకోవడం ద్వారా మీ ఆర్థిక కార్యకలాపాలను మరింత సులభతరం చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

New Rules from June 1st: క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..
New Rules from June 1st

కొత్త నెల జూన్ 2025 ప్రారంభమవుతోంది. ఇది కేవలం కేలెండర్‌లో మార్పు మాత్రమే కాదు. ఇది మన ఆర్థిక జీవితాలపై ప్రభావం చూపించే కీలక మార్పులకు సమయం కూడా. ఈ క్రమంలో జూన్ 1 నుంచి (New Rules from June 1st) మ్యూచువల్ ఫండ్లు, క్రెడిట్ కార్డులు, పీఎఫ్ నిబంధనలు, వడ్డీ రేట్లు, ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ సహా అనేకం మారనున్నాయి. ఈ మార్పుల గురించి తెలుసుకోకుంటే మీరే నష్టపోయే అవకాశం ఉంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.


కొత్త కట్ ఆఫ్ టైం..

SEBI (భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు) ఓవర్‌నైట్ మ్యూచువల్ ఫండ్స్‌కి జూన్ 1 నుంచి కొత్త కట్ ఆఫ్ సమయాలను ప్రకటించింది. ఆఫ్‌లైన్ లావాదేవీలకు మధ్యాహ్నం 3 గంటలు, ఆన్‌లైన్ లావాదేవీలకు సాయంత్రం 7 గంటలుగా తెలిపింది. ఈ సమయాల తర్వాత చేసిన లావాదేవీలు తదుపరి రోజున మాత్రమే ప్రాసెస్ అవుతాయి. దీంతో మీ ఇన్వెస్ట్‌మెంట్‌కి వర్తించబోయే NAV (నెట్ ఆస్తి విలువ) మారుతుంది. ఓవర్‌నైట్ ఫండ్లు చాలా తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి ఎంపిక కాగా, వీటిలో ఒక్క రోజు వ్యవధి గల ప్రభుత్వ బాండ్లు కూడా ఉంటాయి. ఈ మార్పులు ఫండ్ కార్యకలాపాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి నిర్ణయించారు.


క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు

Kotak Mahindra Bank, HDFC Bank, Axis Bank వంటి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.

Kotak Mahindra Bank (జూన్ 1 నుంచి)

రివార్డ్ పాయింట్లపై పరిమితి (ఫ్యూయెల్, రెంట్, బిల్లులు, ఇన్సూరెన్స్‌పై), నెలవారీ ఫ్యూయెల్ ఖర్చు ఒక స్థాయి దాటితే 1% ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేస్తారు. రెంట్ & ఎడ్యుకేషన్ ఖర్చులపై ఎలాంటి పరిమితి లేకుండా 1% ఫీజు వసూలు చేస్తారు. వాలెట్ లోడ్, ఆన్‌లైన్ గేమింగ్‌పై అదనపు చార్జీలు ఉంటాయి.


HDFC Bank (జూన్ 10 నుంచి)

Tata Neu Infinity & Plus కార్డులకు లౌంజ్ యాక్సెస్ ఇప్పుడు స్పెండ్ ఆధారంగా వోచర్ల రూపంలో లభిస్తుంది. మునుపటి విధానం ప్రకారం స్వైప్ ద్వారా లభించే లాంజ్ యాక్సెస్ ఇకపై ఉండదు.

Axis Bank (జూన్ 20 నుంచి)

Axis REWARDS క్రెడిట్ కార్డ్‌కి క్రమంగా మార్పులు రానున్నాయి. క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్, ఇతర ఖర్చుల కేటగిరీలు అన్నీ దీనిలో భాగమవుతాయి.


పీఎఫ్ మరింత సులభం

Employees Provident Fund Organisation (EPFO) జూన్ నెలలో EPFO 3.0 సిస్టమ్‌ను ప్రారంభించబోతుంది. ఈ క్రమంలో మీరు విత్ డ్రా చేయాలనుకున్న మొత్తాన్ని ATM లేదా UPI ద్వారా తక్షణం విత్ డ్రా చేసుకోవచ్చు. UPI యాప్‌ల ద్వారా బాలెన్స్ చెక్ చేసుకోవడం, క్లెయిమ్ ప్రాసెసింగ్, గ్రీవెన్స్ పరిష్కారం వంటి సేవలను ఈజీగా పొందవచ్చు.

ఐటీఆర్ గడువు

మీరు కంపెనీ ద్వారా ఫామ్ 16 పొందడానికి చివరి తేది జూన్ 15. ఇది ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేయడంలో చాలా కీలకం కానుంది. మీరు ఉద్యోగి అయితే తప్పక ఈ డాక్యుమెంట్‌ను పొందాల్సి ఉంటుంది.


ఆధార్ అప్‌డేట్ గడువు

myAadhaar పోర్టల్ ద్వారా ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి చివరి తేది జూన్ 14గా ఉంది. ఆన్ లైన్‎లో జూన్ 14 తర్వాత రూ. 25 ఛార్జ్ చేస్తారు. ఆధార్ సెంటర్‌లో అప్‌డేట్ చేసేందుకు జూన్ 14 తర్వాత రూ. 50 వసూలు చేస్తారు. మీ ఆధార్ వివరాలు ఇంకా మార్చుకోకుంటే ఇప్పుడే మార్చుకోండి మరి.

సిలిండర్ ధరల్లో మార్పు

ప్రతి నెలా మొదటి తేదీన ఆయిల్ కంపెనీలు LPG గ్యాస్ ధరలను మార్చుతుంటాయి. మే నెలలో ధర తగ్గిన నేపథ్యంలో, జూన్ 1న మరో సవరణ వచ్చే ఛాన్సుంది. ఇది గృహ వినియోగదారుల బడ్జెట్‌పై ప్రభావం చూపనుంది.


ఇవీ చదవండి:

ప్రమాదంలో ప్రజలు.. కోల్పోనున్న హిందూ కుష్ హిమాలయాలు

మరో షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్..ఆ సుంకం 50 శాతానికి పెంపు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 12:37 PM