Share News

Modi Government: ప్రతి ఒక్కరికీ రూ.10వేలు వేసిన మోదీ ప్రభుత్వం.. ఏటీఎంల వద్ద జనాలు, నిజమేనా..

ABN , Publish Date - May 17 , 2025 | 05:06 PM

ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ రూ.10,000 వరకు సంపాదించవచ్చని, అందుకోసం రిజిస్టర్ చేసుకోవాలని ఓ పోస్టులో పేర్కొన్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Modi Government: ప్రతి ఒక్కరికీ రూ.10వేలు వేసిన మోదీ ప్రభుత్వం.. ఏటీఎంల వద్ద జనాలు, నిజమేనా..
Modi government rs10000 scheme

ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ పోస్టులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం కొత్తగా ఓ స్కీమ్ ప్రారంభించిందని సోషల్ మీడియా పోస్ట్ వెలుగులోకి వచ్చింది. అందులో మోదీ ప్రభుత్వం కొత్తగా ఓ ప్రాజెక్టు ఆరంభించినట్లు ప్రభుత్వ వెబ్‌సైట్ మాదిరిగా ఉన్న ఓ సైట్ తెలిపింది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ రోజూ రూ.10 వేలు సంపాదించవచ్చని వెల్లడించారు. ఈ క్రమంలో రిజిస్టర్ చేసుకోవాలని, మీ వివరాలను నమోదు చేయాలని కోరింది. ఇప్పటికే అనేక మందికి డబ్బులు వచ్చాయని పేర్కొన్నారు. ఇది తెలిసిన అనేక మంది అకౌంట్లు చెక్ చేసుకునేందుకు ఏటీఎం కేంద్రాలకు పరుగులు తీశారు.


వ్యక్తిగత వివరాలు..

ఈ క్రమంలోనే నకిలీ వార్తలు, పుకార్లను ఆపడానికి ప్రభుత్వ స్థాయిలో పనిచేసే PIB ఫ్యాక్ట్ చెక్ బృందం ఈ పోస్టుకు సంబంధించిన వెబ్‌సైట్ నకిలీదని ప్రకటించింది. ఇలాంటి వాటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటువంటి వెబ్‌సైట్‌లను క్లిక్ చేయెుద్దని తెలిపింది. దీంతోపాటు మీ వ్యక్తిగత వివరాలు లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకోవద్దని కోరింది. మీ వివరాలను పంచుకుంటే సైబర్ మోసగాళ్లు దోచుకునే ఛాన్స్ ఉందని, ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని మరోసారి అధికారులు తెలిపారు.


నకిలీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లను ఎలా గుర్తించాలి..

ఢిల్లీ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ప్రకారం ఏదైనా ప్రభుత్వ వెబ్‌సైట్ నిజమైనదా, కాదా? అని తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఏదైనా వెబ్‌సైట్ ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాలు లేదా సబ్సిడీలను అందిస్తున్నట్లు చెబితే, ముందుగా దాని ప్రామాణికతను లేదా ఆధారాలను పూర్తిగా తనిఖీ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఏదైనా ప్రభుత్వ పథకం గురించి సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి @PIBFactCheckకు ట్వీట్ చేయవచ్చని లేదా సంబంధిత ప్రభుత్వ విభాగాన్ని నేరుగా సంప్రదించవచ్చని సూచిస్తున్నారు.


ఈ విషయాలు గుర్తుంచుకోవాలి

.gov.in పొడిగింపు ఉన్న వెబ్‌సైట్‌లు మాత్రమే నిజమైన ప్రభుత్వ వెబ్‌సైట్‌లుగా పరిగణించబడతాయని సూచించారు. అయితే .in లేదా .org ఎక్స్‌టెన్షన్ ఉన్న వెబ్‌సైట్‌లు ప్రభుత్వ వెబ్‌సైట్‌లుగా చెప్పుకుంటే, వాటిని విశ్వసించే ముందు జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

YouTuber leaks to Pakistan: పాకిస్థాన్‌కు సమాచారం.. మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురు అరెస్టు..

Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..

Intraday Trading: స్టాక్ మార్కెట్ ఇంట్రాడేలో ఎంత మంది నష్టపోతున్నారో తెలుసా..


Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 05:33 PM