Share News

LPG Gas Price November 2025: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..

ABN , Publish Date - Nov 01 , 2025 | 08:19 AM

నిత్యావసర వస్తువుల్లో చాలా కీలమైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. తదననుగుణంగా ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. నవంబర్ 1వ తేదీ నుంచి..

LPG Gas Price November 2025: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..
LPG Gas Price November 2025

ఇంటర్నెట్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో చాలా కీలమైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. తదననుగుణంగా ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ఈ క్రమంలో నవంబర్ 1వ తేదీ నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ ధరల్లో మార్పులు వచ్చాయి.


గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. కమర్షియల్ సిలిండర్ల ధరలు మాత్రం కొంత మేర ఈ నెలలో తగ్గించారు. 19 కిలోల వాణిజ్య అవసరాలకోసం వాడే LPG సిలిండర్‌ ధర ఐదు రూపాయలు తగ్గింది.


ఢిల్లీలో, 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,590.50 ఉంది. గతంలో రూ.1,595.50 గా ఉండేది. కోల్‌కతాలో ప్రస్తుత ధర రూ.1,694, ముంబైలో రూ.1,542, చెన్నైలో రూ.1,750. హైదరాబాద్‌లో రూ.1,812.50 ఉంది.


ఇక, గృహ వినియోగ LPG సిలిండర్ల ధరలు గత నెలలో లాగనే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ ధర రూ.850 నుంచి రూ.960 మధ్య ఉంది. ఢిల్లీలో రూ.853, ముంబైలో రూ.852.50, హైదరాబాద్‌లో రూ.905 ఉంది.


ఇవి కూడా చదవండి..

బురద మీద పడిందని బుద్ధి చెప్పింది.. ఈ మహిళ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..

పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2025 | 08:19 AM