Share News

Business: టీసీఎస్, వియనై కీలక ఒప్పందం

ABN , Publish Date - Apr 18 , 2025 | 03:30 AM

టాటా గ్రూప్ సంస్థలైన టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కీలక మైలురాయిలను సాధించాయి. టాటా స్టీల్ ట్యూబ్స్ విభాగం FY25లో ఒక మిలియన్ టన్నుల ఉత్పత్తి, విక్రయాలను దాటి దేశంలో అత్యంత వైవిధ్యమైన ట్యూబ్స్ తయారీ సంస్థగా నిలిచింది.

Business: టీసీఎస్, వియనై కీలక ఒప్పందం

ముంబై: టాటా గ్రూప్ సంస్థలైన టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కీలక మైలురాయిలను సాధించాయి. టాటా స్టీల్ ట్యూబ్స్ విభాగం FY25లో ఒక మిలియన్ టన్నుల ఉత్పత్తి, విక్రయాలను దాటి దేశంలో అత్యంత వైవిధ్యమైన ట్యూబ్స్ తయారీ సంస్థగా నిలిచింది.

టాటా స్టీల్...

ఒక మిలియన్ టన్నుల మైలురాయిటాటా స్టీల్ ట్యూబ్స్ విభాగం పెద్ద ఎత్తున నిర్మాణాలు, మెట్రోలు, విమానాశ్రయాలు, రైల్వేలతో సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుండి గిడ్డంగుల వంటి పారిశ్రామిక కార్యకలాపాల వరకు విస్తృత అనువర్తనాలను కలిగి ఉంది. ఈ ఉత్పత్తులు వాహన, చమురు, గ్యాస్ రంగాలతో పాటు రూఫ్ షెడ్స్, గేట్ల వంటి రిటైల్ అవసరాలకు సేవలందిస్తాయి.


టీసీఎస్

ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ జనరేటివ్ ఏఐ కంపెనీలలో ఒకటిగా ఉన్న వియనై సిస్టమ్స్‌తో భాగస్వామ్యం ద్వారా, కస్టమర్లకు వియనై హిలా ప్లాట్‌ఫారమ్ ద్వారా డేటాతో సంభాషించే అవకాశాన్ని టీసీఎస్ కల్పిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ సహజ భాషా సంభాషణలను అధునాతన డేటా విశ్లేషణలతో కలపడం ద్వారా, ఫైనాన్స్, సరఫరా గొలుసు, విక్రయాల రంగాలలో నిర్ణయాధికారాలకు సాంకేతిక నైపుణ్యం అవసరం లేకుండానే తక్షణ సమాధానాలను అందిస్తుంది. టీసీఎస్ సీఈవో, ఎండీ, కృతివాసన్ మాట్లాడుతూ.. “డేటాను సహజంగా, సులభంగా అర్థమయ్యేలా మార్చడం ఈ ఒప్పందం ఉద్దేశం. వియనైతో మా భాగస్వామ్యం ఈ కలను సాకారం చేస్తుంది. సీఎక్స్‌ఓలు తమ డేటాతో, వేగవంతమైన సమాధానాలు పొందగలరు. జనరేటివ్ ఏఐ వినియోగం ద్వారా, సంక్లిష్టతను తగ్గించి, మానవ కేంద్రీకృత విధానంతో వృద్ధి సాధించగలం” అని అన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 03:30 AM