Indian Auto Industry: వేగం తగ్గిన వాహనం
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:32 AM
జూలై నెలలో ప్యాసింజర్ వాహన టోకు విక్రయాలు మందగించాయి. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీ

న్యూఢిల్లీ: జూలై నెలలో ప్యాసింజర్ వాహన టోకు విక్రయాలు మందగించాయి. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీ ఇండియా విక్రయాల్లో వార్షిక ప్రాతిపదికన స్వల్ప పెరుగుదల నమోదు కాగా.. టాటా మోటార్స్, హ్యుండయ్ మోటార్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా సేల్స్ మాత్రం వరుసగా రెండంకెల, ఏక అంకె వృద్ధిని నమోదు చేయగలిగాయి. గత ఏడాది జూలైలో మారుతి సుజుకీ దేశీయ విక్రయాలు 1,37,463 యూనిట్లుగా ఉండగా.. ఈ ఏడాది జూలైలో అమ్మకాలు 1,37,776 యూనిట్లకు పెరిగాయి. ఈ జూలైలో హ్యుండయ్ మోటార్ సేల్స్ 10ు తగ్గి 43,973 యూనిట్లకు జారుకోగా.. టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు 12ు క్షీణించి 39,521 యూనిట్లకు పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ విక్రయాలు 20 శాతం వృద్ధితో 49,871 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ యుటిలిటీ వాహనాలకు మార్కెట్లో అధిక డిమాండ్ నెలకొనడం ఇందుకు దోహదపడింది. కియా ఇండియా మొత్తం అమ్మకాలు 8 శాతం పెరిగి 22,135 యూనిట్లకు చేరుకోగా, టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 3 శాతం పెరుగుదలతో 32,575 యూనిట్లకు, హోండా కార్ల మొత్తం విక్రయాలు 3ు వృద్ధితో 7,524 యూనిట్లుగా నమోదయ్యాయి. జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్స్ అమ్మకాలు మాత్రం ఏకంగా 46ు పెరిగి 6,678 యూనిట్లకు చేరాయి.
టూవీలర్ ఓకే..
ద్విచక్ర వాహన విభాగంలో చాలా కంపెనీల అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నాయి. గత నెలలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) దేశీయ విక్రయాలు 4,66,331 యూనిట్లుగా నమోదుకాగా.. హీరో మోటోకార్ప్ సేల్స్ 4,12,397 యూనిట్లకు ఎగబాకాయి. టీవీఎస్ మోటార్ దేశీయ విక్రయాలు 21ు వృద్ధితో 3,08,720 యూనిట్లకు చేరగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 25 శాతం పెరిగి 76,254 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీయంగా బజాజ్ ఆటో టూవీలర్ సేల్స్ 18 శాతం తగ్గి 1,39,279 యూనిట్లకు పడిపోగా.. సుజుకీ మోటార్‌సైకిల్ అమ్మకాలు 96,029 యూనిట్లకు పరిమితమయ్యాయి.
ఇవి కూడా చదవండి
తప్పతాగి డ్యూటీకి.. అడ్డంగా జనానికి దొరికిపోయిన ఎస్ఐ
మాజీ క్లర్క్ అవినీతి దందా.. 15వేల జీతం.. 30 కోట్ల ఆస్తులు