Share News

Infosys Net Profit Decline: మెప్పించని ఇన్ఫీ

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:57 AM

ఇన్ఫోసిస్‌ క్యూ4 లాభాలు 12% తగ్గి రూ.7,033 కోట్లకు పరిమితమయ్యాయి. 2025-26లో ఆదాయం 0-3% మాత్రమే పెరుగుతుందన్న అంచనాతో మార్కెట్‌ నిరాశ చెందింది

 Infosys Net Profit Decline: మెప్పించని ఇన్ఫీ

  • క్యూ4 లాభంలో 12 Per క్షీణత .. జూ రూ.7,033 కోట్లకు పరిమితం

  • 2025-26లో 0-3 Per ఆదాయ వృద్ధి అంచనా జూ ఒక్కో షేరుకు రూ.22 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ గురువారం ప్రకటించి న ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేకపోయాయి. మార్చి 31తో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ ఏకీకృత నికర లాభం రూ.7,033 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.7,969 కోట్ల లాభంతో పోలిస్తే 11.7 శాతం తగ్గింది. క్యూ4లో కంపెనీ ఆదాయం మాత్రం 7.9 శాతం పెరిగి రూ.40,925 కోట్లకు చేరింది. గత ఏడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే లాభం 3.3 శాతం పెరగగా.. ఆదాయం 2 శాతం తగ్గింది. కాగా, సమీక్షా కాలానికి సంస్థ నిర్వహణ లాభాల మార్జిన్‌ వార్షిక ప్రాతిపదికన 0.9 శాతం పెరగగా.. త్రైమాసిక ప్రాతిపదికన 0.3 శాతం తగ్గింది.

2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి లాభం 1.8ు వృద్ధితో రూ.26,713 కోట్లుగా, ఆదాయం 6.06 Per పెరుగుదలతో రూ.1,62,990 కోటులగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం (స్థిర కరెన్సీ ఆధారిత) 0-3 శాతం శ్రేణిలో వృద్ధి చెందవచ్చని ఇన్ఫోసిస్‌ అంచనా వేసింది. నిర్వహణ మార్జిన్‌ 20-22 శాతం నమోదుకావచ్చ ని కంపెనీ భావిస్తోంది. కాగా, గడిచిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయ వృద్ధిని 4..5-5 శాతంగా అంచనా వేసింది.


  • క్యూ4లో కంపెనీకి ఆర్థిక సేవల రంగం నుంచి ఆదాయం 12.6 శాతం పెరగగా.. తయారీ రంగం నుంచి రెవెన్యూ 14 శాతం వృద్ధి చెందింది. ప్రాంతాలవారీగా చూస్తే, భారత మార్కెట్‌ నుంచి రాబడి 43.7 శాతం పుంజుకోగా.. యూరప్‌ రెవెన్యూ 15 శాతం పెరిగింది. కంపెనీకి కీలక మార్కెట్‌ అయిన ఉత్తర అమెరికా నుంచి ఆదాయం 0.4 శాతం తగ్గింది.

  • గడిచిన క్వార్టర్‌లో 260 కోట్ల డాలర్ల విలువైన బడా డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దాంతో 2024-25 మొత్తానికి బడా ఆర్డర్ల విలువ 1,160 కోట్ల డాలర్లకు చేరుకుందని, అందులో 56 శాతం కొత్తవేనని తెలిపింది.

  • గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నగదు ప్రవాహం 410 కోట్ల డాలర్లకు పెరిగింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికమని ఇన్ఫీ సీఎఫ్ఓ జయేశ్‌ సంఘ్రజ్క తెలిపారు.

  • బీఎస్ఈలో ఇన్ఫోసిస్‌ షేరు గురువారం 0.51 శాతం పెరిగి రూ.1,420.20 వద్ద ముగిసింది.

2 కంపెనీల కొనుగోలు: తాజాగా రెండు కంపెనీలను చేజిక్కించుకున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఆస్ట్రేలియాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సేవల సంస్థ ‘ది మిస్సింగ్‌ లింక్‌’ను 9.8 కోట్ల ఆస్ట్రేలియన్‌ డాలర్లకు (సు మారు రూ.532 కోట్లు) కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. కాగా, అమెరికాలోని హ్యూస్టన్‌, టెక్సాస్‌ కేంద్రాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న టెక్నాలజీ అండ్‌ బిజినెస్‌ కన్సల్టింగ్‌ కంపెనీ ఎంఆర్‌ఈ కన్సల్టింగ్‌ను సైతం 3.6 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.307.4 కోట్లు) కొనుగోలు చేసేందుకు డీల్‌ కుదుర్చుకున్నట్లు ఇన్ఫీ వెల్లడించింది. ఈ జూన్‌ కల్లా పూర్తికానున్న ఈ రెండు డీల్స్‌.. పూర్తిగా నగదు రూపంలో జరగనున్నాయి.


పరేఖ్‌కు రూ.50 కోట్ల షేర్ల కేటాయింపు: గడిచిన ఆర్థిక సంవత్సరంలో తమ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌కు ఎంప్లాయిస్‌ స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్స్‌ (ఈఎస్ఓపీ) కింద రూ.50 కోట్ల షేర్లను కేటాయించడం జరిగిందని ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.

మూర్తి మనవడికి రూ.3.3 కోట్ల బొనాంజా

గత ఆర్థిక సంవత్సరానికిగాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.22 తుది డివిడెండ్‌ చెల్లించాలని ఇన్ఫోసిస్‌ బోర్డు ప్రతిపాదించింది. తుది డివిడెండ్‌తో కలిపి గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ చెల్లించే డివిడెండ్‌ 2023-24 చెల్లింపుల కంటే 13.2 శాతం అధికం. తుది డివిడెండ్‌ చెల్లింపుల ద్వారా కంపెనీ సహ-వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి 17 నెలల మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి రూ.3.3 కోట్లు లభించనున్నాయి. ఇన్ఫోసిస్‌లో 0.04 శాతం వాటాకు సమానమైన 15 లక్షల షేర్లు ఏకాగ్రహ్‌ పేరిట ఉన్నాయి. నారాయణ మూర్తి తన మనవడికి 2024 మార్చిలో ఈ షేర్లను బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో వాటి విలువ రూ.240 కోట్లు. కాగా, ఇన్ఫోసి్‌సలో 1.04 శాతం వాటాకు సమానమైన 3.89 కోట్ల షేర్లను కలిగిన మూర్తి కూతురు, బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషీ సునాక్‌ భార్య అక్షతా మూర్తికి డివిడెండ్‌ రూపంలో రూ.85.71 కోట్లు లభించనున్నాయి.


ఈ సారి 20,000 మంది ఫ్రెషర్ల హైరింగ్‌

క్యూ4లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య మరో 199 మేర పెరిగి, ఈ మార్చి 31 నాటికి 3,23,578కి చేరింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఉద్యోగుల సంఖ్య 6,000 పెరిగింది. కాగా, గత త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల వలసల రేటు 14.1 శాతానికి పెరిగింది. క్యూ3లో ఇది 13.7 శాతంగా నమోదైంది. 2024-25లో ప్రాంగణ నియామకాల ద్వారా 15,000 మంది ఫ్రెషర్లను చేర్చుకున్నట్లు ఇన్ఫోసిస్‌ సీఎ్‌ఫఓ జయేశ్‌ సంఘ్రజ్క తెలిపారు. గతంలోనే ప్రకటించిన విధంగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్ల నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.

Updated Date - Apr 18 , 2025 | 02:01 AM