Infosys: ఇన్ఫీ భళా
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:18 AM
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించా యి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం రూ.6,921 కోట్లకు చేరుకుంది.

అంచనాలను మించిన త్రైమాసిక ఫలితాలు
క్యూ1 లాభం రూ.6,921 కోట్లు
రెవెన్యూ వృద్ధి అంచనా 1-3 శాతానికి పెంపు
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించా యి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం రూ.6,921 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.6,368 కోట్ల లాభంతో పోలిస్తే 8.7 శాతం వృద్ధి కనబరిచింది. ఈ క్యూ1లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7.53ు పెరిగి రూ.42,279 కోట్లు గా నమోదైంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవల్లో బలమైన పనితీరుతో పాటు కొత్త డీల్స్ ఇందుకు దోహదపడ్డాయని కంపెనీ పేర్కొంది. కాగా, ఈ మార్చితో ముగిసిన త్రైమాసికం తో పోలిస్తే నికర లాభం 1.5ు తగ్గగా.. ఆదాయం మాత్రం 3.3ు పెరిగింది.
మరిన్ని ముఖ్యాంశాలు..
ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయ వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 0-3 శాతం నుంచి 1-3 శాతానికి మెరుగుపరిచింది. మార్జిన్ అంచనాను మాత్రం 20-22 శాతంగా కొనసాగించింది.
గత త్రైమాసికంలో 380 కోట్ల డాలర్ల విలువైన బడా డీల్స్‌ను దక్కించుకున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ జూన్ చివరి నాటికి మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య మాత్రం 1,861కు తగ్గింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంఖ్య 1,869గా ఉంది.
క్యూ1లో కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య కేవలం 210 పెరుగుదలతో 3,23,788కి చేరింది. ఉద్యోగుల వలసల రేటు 14.4 శాతానికి పెరిగింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాంగణ నియామకాల ద్వారా 20,000 మందిని ఉద్యోగంలో చేర్చుకోనున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించింది.
విభాగాలవారీగా చూస్తే, ఈ క్యూ1లో కంపెనీ మొత్తం ఆదాయంలో 27.9 శాతం ఆర్థిక సేవల రంగం నుంచి సమకూరింది. తయారీ రంగం వాటా 16.1 శాతం, రిటైల్ రంగం వాటా 13.4 శాతంగా ఉంది.
మార్కెట్ల వారీగా, మొత్తం ఆదాయంలో ఉత్తర అమెరికా వాటా 56.5 శాతానికి తగ్గింది. అయినప్పటికీ, కంపెనీకి అత్యధిక ఆదాయం ఈ మార్కెట్ నుంచే సమకూరుతోంది. యూర ప్ మార్కెట్ వాటా 31.5 శాతానికి పెరిగింది. గడిచిన కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ యూరప్ మార్కెట్లో బలమైన పనితీరు కనబరుస్తూ వస్తోందని ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ జయేశ్ సంఘ్రజ్క అన్నారు. ఇది కొన్నేళ్లక్రితం యూరప్‌లో కంపెనీ పెట్టిన పెట్టుబడుల ప్రతిఫలమని ఆయన పేర్కొన్నారు.
బీఎస్‌ఈలో బుధవారం ట్రేడింగ్ ముగిసేసరికి, ఇన్ఫోసిస్ షేరు ధర 0.27 శాతం పెరిగి రూ.1,574.40 వద్ద స్థిరపడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News