Share News

Flight Tickets Booking: 1 రూపాయికే ఫ్లైట్ టికెట్.. నవంబర్ 30 వరకే

ABN , Publish Date - Nov 13 , 2025 | 07:16 PM

పసిపిల్లలతో ఫ్లైట్ ప్రయాణం సవాలుతో కూడిందే. వారి తల్లిదండ్రులకు తమ వంతు మద్దతుగా ఇండిగో ఎయిర్ లైన్స్ ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఒక రూపాయికే ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ..

Flight Tickets Booking: 1 రూపాయికే ఫ్లైట్ టికెట్.. నవంబర్ 30 వరకే
Flight Tickets Booking

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో బంపరాఫర్ ప్రకటించింది. పసి పిల్లలు ఉన్న తల్లిదండ్రుల ప్రయాణం తక్కువ ధరకే చేసే అవకాశమిచ్చింది. దాదాపు రూ.1750 మేర ఆదా చేసుకోవచ్చని ప్రకటించింది. అంతేకాదు, పసి పిల్లల కోసం కేవలం ఒక రూపాయికే విమాన ప్రయాణం (ఇన్ఫాంట్ ఫ్లై ఎట్ రూ.1) పేరుతో స్పెషల్ సేల్ తీసుకొచ్చింది.


ఏడాది లోపు వయసున్న పిల్లలకు ఒక్క రూపాయికే విమాన ప్రయాణం కల్పిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. అయితే నేరుగా ఇండిగో అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకుంటేనే ఆ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. 1 రూపాయితో టికెట్ కొనుగోలు చేసిన తల్లిదండ్రులు చెక్-ఇన్ పాయింట్ దగ్గర పిల్లల వయసు ధ్రువీకరణ కోసం వాలిడ్ డాక్యుమెంట్లు అయిన, బర్త్ సర్టిఫికెట్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, హాస్పిటల్ డిశ్చార్జ్ కార్డ్, పాస్ట్‌పోర్ట్ వంటివి చూపించాల్సి ఉంటుంది.


ఒక రూపాయికే టికెట్ ఆఫర్ నవంబర్ 30, 2025 వరకు ఉంటుందని ఇండిగో ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ఈ టికెట్ మీద దేశీయ విమానాల్లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలకోసం అధికారిక వెబ్‌సైట్లో డీల్స్ అండ్ ఆఫర్స్ విభాగంలో వెల్లడించింది. పసిపిల్లలతో జర్నీ చేసేవారికి తమ వంతు మద్దతుగా ఈ ఆఫర్ ఇస్తున్నట్టు తెలిపింది.


ఇవీ చదవండి:

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..

Terror Accused Shaheen: అలా చేసిందంటే నమ్మశక్యంగా లేదు: షాహీన్ కుటుంబం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 07:16 PM