Share News

Stock Market: కొనసాగిన లాభాలు..ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:10 PM

విదేశీ పెట్టుబడిదారులు పాజిటివ్‌గా ఉండడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం సూచీలకు కలిసి వచ్చింది. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి. బుధవారం భారీ లాభాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే ధోరణిలో ప్రయాణించాయి.

Stock Market: కొనసాగిన లాభాలు..ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

బుధవారం భారీ లాభాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే ధోరణిలో ప్రయాణించాయి. మధ్యాహ్నం తర్వాత కాస్తంత తడబడినా చివరకు లాభాలతోనే రోజును ముగించాయి. విదేశీ పెట్టుబడిదారులు పాజిటివ్‌గా ఉండడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం సూచీలకు కలిసి వచ్చింది. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (85, 609)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఒక దశంలో 86 వేల మార్క్‌ను కూడా దాటేసింది. అయితే మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు ఆవిరయ్యాయి. చివర్లో అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ కిందకు దిగి వచ్చింది. చివరకు సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 85, 720 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 10 పాయింట్ల లాభంతో 26, 215 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌లో అశోక్ లేలాండ్, మదర్సన్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, బజాజ్ ఫైనాన్స్, కోఫోర్జ్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). కేన్స్ టెక్నాలజీస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఎయిచర్ మోటార్స్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, ఇండియన్ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 51 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 209 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.31గా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2025 | 04:10 PM