Share News

India US trade talks: భారత్ గొప్ప ఆఫర్లు ఇస్తోంది.. ట్రేడ్ డీల్‌పై అమెరికా ప్రతినిధి ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , Publish Date - Dec 11 , 2025 | 08:14 AM

ఒకవైపు సుంకాలతో దాడులకు దిగుతూనే మరోవైపు ట్రేడ్ డీల్ ద్వారా భారత్‌తో సయోధ్య కుదుర్చుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్‌కు సంబంధించి కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే అవి ఒక కొలిక్కి రావడం లేదు.

India US trade talks: భారత్ గొప్ప ఆఫర్లు ఇస్తోంది.. ట్రేడ్ డీల్‌పై అమెరికా ప్రతినిధి ఆసక్తికర వ్యాఖ్యలు..
trade negotiation updates

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్‌తో వాణిజ్య యుద్ధానికి తెర తీసిన సంగతి తెలిసిందే. భారత్ ఉత్పత్తులపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. ఒకవైపు ఇలా సుంకాలతో దాడులకు దిగుతూనే మరోవైపు ట్రేడ్ డీల్ ద్వారా భారత్‌తో సయోధ్య కుదుర్చుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్‌కు సంబంధించి కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే అవి ఒక కొలిక్కి రావడం లేదు (bilateral trade agreement).


ఈ నేపథ్యంలో అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రేడ్ డీల్‌లో భాగంగా అమెరికాకు భారత్ గొప్ప ఆఫర్లు అందించడానికి ముందుకొస్తోందని తాజాగా వాషింగ్టన్‌లో జరిగిన సెనేట్ అప్రోప్రియేషన్స్ సబ్ కమిటీలో ఆయన తెలిపారు. చరిత్రలో ఇప్పటివరకు అమెరికా అందుకోలేకపోయిన ఆఫర్లతో భారత్ ముందుకు వస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే కొన్ని పంటలు, మాంసం, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మాత్రం భారత్ నుంచి వ్యతిరేకత వస్తోందన్నారు (US farm access demand).


ప్రస్తుతం అమెరికా డిప్యూటీ ట్రేడ్ ప్రతినిధులు బృందంతో భారత బృందం చర్చలు జరుపుతోంది (India US economic relations). వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తొలి రోజున ఈ చర్చలను ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో పురోగతి కనిపిస్తోందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకెళ్తున్నామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ కూడా ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..

Updated Date - Dec 11 , 2025 | 08:14 AM