Share News

Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

ABN , Publish Date - Jun 13 , 2025 | 03:03 PM

ప్రస్తుత జీవన శైలిలో అనుకోకుండా వచ్చే ఖర్చులను తీర్చుకునేందుకు అనేక మంది పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. కానీ, ఈ రుణాలు క్రమంగా తీర్చే బదులు, భారంగా మారుతుంటాయి. ఒకటికి మించి లోన్స్ ఉంటే వాటిని ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఈజీగా తీర్చేందుకు ఏం చేయాలనే (Personal Loan Repayment) విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
Personal Loan Repayment

ప్రస్తుత డిజిటల్ యుగంలో అనేక మంది ఉద్యోగులు కూడా అకస్మాత్తుగా వచ్చే ఖర్చుల నుంచి ఉపశమనం పొందేందుకు పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు. ఈ లోన్స్ మీ శాలరీని బట్టి తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకుంటే మాత్రం చెల్లించే విషయంలో మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే మీరు ఒకటికి మించి ఇలాంటి లోన్స్ తీసుకుంటే ఆర్థిక భారం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి. వాటిని సరిగ్గా ప్లాన్ చేసి స్మార్ట్‌గా ఎలా చెల్లింపులు (Personal Loan Repayment) చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


1. ఆదాయం, ఖర్చుల అంచనా (Personal Loan Tips)

మీరు తీసుకునే రుణాన్ని బట్టి మీ ఆదాయం సరిపోతుందా లేదా అనేది ముందే చూసుకోవాలి. లేదంటే ప్రతి నెలలో కూడా ఈఎంఐ చెల్లింపుల విషయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మొదట మీ ఖర్చులు, మొత్తం బడ్జెట్ సిద్ధం చేసుకొని అప్పుడు లోన్ తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీరు తీసుకున్న రుణాన్ని సకాలంలో తీర్చేందుకు అవకాశం ఉంటుంది.


2. జీతం వచ్చిన వెంటనే EMI చెల్లించడం

మీరు తీసుకున్న లోన్ మీ జీతం వచ్చిన వెంటనే మొదట EMI చెల్లించేందుకు ప్రయత్నించాలి. లోన్ చెల్లింపు పెండింగ్ పడకుండా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా బౌన్స్ ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు. ఇది మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్‌ను పెంచుతుంది.

3. రుణాల సమీకరణ (Loan Consolidation)

మీ వద్ద రెండు లేదా అంతకంటే ఎక్కువ రుణాలు ఉంటే, వాటిని కలిపి ఒకే పర్సనల్ లోన్‌లో మార్చుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మీరు ఒకే EMI ద్వారా మిగతా మొత్తాన్ని చెల్లించుకోవచ్చు. దీంతోపాటు మీకు వడ్డీ రేటు కూడా తక్కువగా వచ్చే ఛాన్సుంది.


4. లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్

ప్రస్తుతం మీ లోన్‌పై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే, తక్కువ వడ్డీ రేటు కలిగిన మరో బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మీ వడ్డీ భారాన్ని తగ్గించడమే కాకుండా, మీ EMIని కూడా తగ్గిస్తుంది.

5. తక్కువ కాలం (Personal Loan Repayment)

మీరు తీసుకున్న లోన్, త్వరగా తీర్చే అవకాశం ఉంటే, తక్కువ టర్మ్ ఉన్న రుణాన్ని తీసుకుని ఎక్కువ EMI చెల్లించుకోవడం మంచిది. దీని వల్ల మీ మొత్తం వడ్డీ ఖర్చు తగ్గిపోతుంది.


6. అధిక వడ్డీ రుణాలకు ప్రాధాన్యత

మీకు అనేక రుణాలు ఉన్నట్లయితే, వాటిలో వడ్డీ రేటు ఎక్కువ ఉన్న రుణాన్ని ముందుగా తీర్చేందుకు ప్రయత్నించండి. దీని వల్ల మీరు వడ్డీ మొత్తాలను తగ్గించుకోగలుగుతారు. పర్సనల్ లోన్‌ను సరైన విధంగా తీర్చడం ద్వారా మీరు ఆర్థికంగా బలంగా మారుతారు. వడ్డీ భారం తగ్గుతుంది, క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఇవన్నీ మీ భవిష్యత్తు ఆర్థిక నిర్ణయాలకు ఉపయోగపడతాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. జూన్ 15 లాస్ట్ డేట్, లేదంటే..


ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 04:01 PM