Share News

GST Slashed: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గనున్న నిత్యావసర ధరలు..

ABN , Publish Date - Jul 02 , 2025 | 01:50 PM

GST Slashed: 12 శాతం శ్లాబ్‌లో మార్పులు తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వంపై వేల కోట్ల భారం పడనుంది. దాదాపు 40 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల ఆర్థిక భారం పడనుంది.

GST Slashed: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గనున్న నిత్యావసర ధరలు..
GST Slashed

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. పలు నిత్యావసర వస్తువులపై ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను తగ్గించనుంది. 12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను తొలగించాలని కేంద్రం భావిస్తోందట. అలా కుదరకపోతే 12 శాతాన్ని 5 శాతానికి కుదించాలని చూస్తోందట. ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ స్లాబ్‌లో దిగువ, మధ్య తరగతి కుటుంబాల వారు ఉపయోగించే నిత్యావసర వస్తువులు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం వాటి జీఎస్టీలో మార్పులు తీసుకువస్తే.. ఆ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి.


ప్రభుత్వం వేల కోట్ల భారం..

12 శాతం శ్లాబ్‌లో మార్పులు తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వంపై వేల కోట్ల భారం పడనుంది. దాదాపు 40 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. వస్తువుల వినియోగాన్ని మరింత పెంచే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతోంది. వస్తువుల ధరలు తగ్గితే.. అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అమ్మకాలు పెరిగితే.. జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని అనుకుంటోంది. ఇక, జీఎస్టీలో మార్పుల గురించి కొద్దిరోజుల క్రితమే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ హింట్ ఇచ్చారు. మధ్య తరగతి కుటుంబాలకు ఊరట నిచ్చేలా జీఎస్టీలో మార్పులు ఉంటాయని చెప్పారు.


వీటి ధరలు తగ్గనున్నాయ్..

1) టూత్ పేస్ట్, టూత్ పౌడర్

2) గొడుగులు

3) కుట్టు మిషన్లు

4) ప్రెషర్ కుక్కర్, ఇతర వంట ఇంటి సామాన్లు

5) ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సులు

6) గీజర్లు

7) తక్కువ కెపాసిటీ కలిగిన వాషింగ్ మిషన్లు

8) సైకిల్లు

9) 1000 రూపాయలకు పైన ధర ఉన్న రెడీమేడ్ బట్టలు

10) 500 నుంచి 1000 రూపాయల మధ్య ధర ఉన్న పాద రక్షలు

11) స్టేషనరీ ఐటమ్స్

12) వ్యాక్సిన్లు

13) సిరామిక్ టైల్స్

14) వ్యవసాయం పరికరాలు


ఇవి కూడా చదవండి

యూఎస్ బీ2 బాంబర్లు ఎక్కడ.. ఇరాన్‌పై దాడి తర్వాత ఏమయ్యాయి..

సినిమాను తలపించే బ్యాంకు దోపిడి.. చిన్న తప్పుతో..

Updated Date - Jul 02 , 2025 | 02:05 PM