Share News

Today Gold Rate: తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

ABN , Publish Date - May 14 , 2025 | 07:21 AM

Today Gold Rate: గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. ఈ క్రమంలో బుధవారం తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Today Gold Rate: తెలుగు రాష్ట్రాలలో  బంగారం ధరలు..
Today Gold Rate

బిజినెస్ న్యూస్: బంగారానికి (Gold) మార్కెట్‌ (Market)లో ఎప్పుడూ డిమాండ్ (Demand) ఉంటుంది. గత కొంత కాలం నుంచి గోల్డ్ ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి (Record Level) చేరుకుంటున్నాయి. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 88,819గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 96,899గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 88,827గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 96,907గా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 88,825గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 96,905గా ఉంది.

Also Read: కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం అక్కర్లేదు


దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..

కోల్‌కతా- రూ.88,815, రూ.96,895

చెన్నై- రూ.88,811, రూ.96,891

బెంగళూరు- రూ.88,805, రూ.96,885

పుణె- రూ.88,823, రూ.96,903

అహ్మదాబాద్- రూ.88,871, రూ.96,951

భోపాల్- రూ.88,874, రూ.96,954

కోయంబత్తూర్- రూ.88,830, రూ.96,910

పట్నా- రూ.88,859, రూ.96,939

సూరత్- రూ.88,878, రూ.96,958


బంగారం స్వచ్ఛమైనదా కాదా, ఇలా చెక్ చేయండి

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్ మార్కులను ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి 9% ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 22 క్యారెట్ల బంగారం 0.916 స్వచ్ఛతను కలిగి ఉండాలి (22/24 = 0.916). 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంలో ఎలాంటి కల్తీ ఉండదు.


ఈ వార్తలు కూడా చదవండి..

మురళీ నాయక్‌కు రుణపడి ఉంటాం

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు..శ్రవణ్‌ రావు అరెస్టు

For More AP News and Telugu News

Updated Date - May 14 , 2025 | 07:21 AM