Gold Rates Hike: పసిడి ప్రయులకు అలర్ట్.. బంగారం ధర మరికొంచెం పెరిగింది..
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:35 PM
ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిల నుంచి క్రమంగా దిగి వస్తున్న బంగారం ధర శనివారం ట్రేడింగ్‌లో స్వల్పంగా పెరిగింది. దీపావళి తర్వాత బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా బంగారం ధర తగ్గడంతో పసిడి ధరలు క్రమంగా దిగివచ్చాయి.
ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిల నుంచి క్రమంగా దిగి వస్తున్న బంగారం ధర శనివారం ట్రేడింగ్‌లో స్వల్పంగా పెరిగింది. దీపావళి తర్వాత బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా పసిడి ధరలు క్రమంగా దిగివచ్చాయి. (Gold prices). అయితే శనివారం ట్రేడింగ్‌లో మాత్రం బంగారం స్వల్ప పెరుగులను నమోదు చేసింది.
శనివారం (అక్టోబర్ 25న) మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 25, 620కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే 125 రూపాయల మేర పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 15, 150కి చేరింది (live gold rates). నిన్నటితో పోల్చుకుంటే 115 రూపాయల మేర పెరుగుదల నమోదు చేసింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 25, 770కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 15, 300కి చేరుకుంది.
ఇవి కూడా చదవండి..
India Pakistan War: భారత్‌తో యుద్ధం పాక్‌కే నష్టం.. మాజీ సీఐఏ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Trump Canada trade talks: ఆ యాడ్‌పై ట్రంప్ ఫైర్.. కెనడాతో ట్రేడ్ టాక్ నిలిపివేత..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..