Share News

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగి వచ్చిన బంగారం ధరలు..

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:19 PM

ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్న బంగారం ధర ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతోంది. బంగారం ధరలో తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరల్లో స్థిరీకరణ జరగడమే ఈ తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది.

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగి వచ్చిన బంగారం ధరలు..
Today gold rate

కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర మంగళవారం కిందకు దిగి వచ్చింది. ఈ రోజు (నవంబర్ 18) మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో goodreturns వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 23, 660కి చేరింది (Gold price in Hyderabad). నిన్నటితో పోల్చుకుంటే దాదాపు రూ. 1,740 తగ్గింది.


ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 13, 350కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు రూ. 1,600 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గుదలకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరల్లో స్థిరీకరణ జరగడమే ఈ తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది (live gold rates). ఇక, ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 23, 810కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 13, 500కి చేరుకుంది.


ఇక, వెండి ధరల్లో కూడా భారీ తగ్గుదల నమోదైంది. కేజీకి 5,000 రూపాయల మేర వెండి ధర తగ్గింది (Silver rate updates). హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1, 70, 000గా ఉంది. ఇక, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1, 62, 000గా ఉంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవీ చదవండి:

పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇదే పెద్ద ప్రమాదమంటున్న ఆనంద్ మహీంద్రా..

మీ బ్రెయిన్‌కు పరీక్ష.. ఈ మంచులో పెంగ్విన్‌ను 15 సెకెన్లలో కనిపెట్టండి..


Read Latest and Viral news

Updated Date - Nov 18 , 2025 | 01:19 PM