Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..
ABN , Publish Date - Apr 22 , 2025 | 06:52 PM
Gold Rate History: ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇండియాలో 85,300 రూపాయలుగా ఉండేది. మార్చి నెలలో 87,550 రూపాయలు ఉండింది. ఏప్రిల్ నెలలో మాత్రం భారీగా పెరిగింది. లక్షకు చేరింది.

బంగారం అధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. ఫంక్షన్లు, అలంకారం కోసం మాత్రమే కాదు.. పెట్టుబడి కోసం కూడా జనాలు పెద్ద మొత్తంలో బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా బంగారంపై పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు తారా స్థాయికి చేరాయి. ఆరు నెలల క్రితం వరకు బంగారం 70 దగ్గర ఉండేది. ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలకు చేరుకుంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇండియాలో 1,02,170 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇండియాలో 85,300 రూపాయలుగా ఉండేది. మార్చి నెలలో 87,550 రూపాయలు ఉండింది. ఏప్రిల్ నెలలో మాత్రం భారీగా పెరిగింది. లక్షకు చేరింది. అయితే, 25 ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో బంగారం ధర చాలా తక్కువగా ఉండేది. ఈ 25 ఏళ్లలో బంగారం ధర దారుణంగా పెరిగింది. 2010 నుంచి 2025 వరకు ఊహించని విధంగా బంగారు రేటు పరుగులు పెట్టింది. 2000 సంవత్సరం నుంచి 2025 వరకు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇండియాలో ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1) 2000 సంవత్సరంలో 4,400 రూపాయలు
2) 2001 సంవత్సరంలో 4,300 రూపాయలు
3) 2002 సంవత్సరంలో 4,990 రూపాయలు
4) 2003 సంవత్సరంలో 5,600 రూపాయలు
5) 2004 సంవత్సరంలో 6,307 రూపాయలు
6) 2005 సంవత్సరంలో 7,638 రూపాయలు
7)2006 సంవత్సరంలో 9,265 రూపాయలు
8)2007 సంవత్సరంలో 10,598 రూపాయలు
9) 2008 సంవత్సరంలో 13,630 రూపాయలు
10) 2009 సంవత్సరంలో 16,686 రూపాయలు
11) 2010 సంవత్సరంలో 20,728 రూపాయలు
12) 2011 సంవత్సరంలో 27,329 రూపాయలు
13) 2012 సంవత్సరంలో 30,859 రూపాయలు
14) 2013 సంవత్సరంలో 28,422 రూపాయలు
15) 2014 సంవత్సరంలో 26,703 రూపాయలు
16) 2015 సంవత్సరంలో 24,931 రూపాయలు
17) 2016 సంవత్సరంలో 27,445 రూపాయలు
18) 2017 సంవత్సరంలో 29,156 రూపాయలు
19) 2018 సంవత్సరంలో 31,391 రూపాయలు
20) 2019 సంవత్సరంలో 39,108 రూపాయలు
21) 2020 సంవత్సరంలో 50,151 రూపాయలు
22) 2021 సంవత్సరంలో 4 8,099 రూపాయలు
23) 2022 సంవత్సరంలో 55,017 రూపాయలు
24) 2023 సంవత్సరంలో 63,203 రూపాయలు
25) 2024 సంవత్సరంలో 78,245 రూపాయలు
26) 2025(ఏప్రిల్22) 1,02,170 రూపాయలు
ఇవి కూడా చదవండి
Lady Aghori: లేడీ అఘోరీని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
అక్కడ ఉండే ప్రతీ బిచ్చగాడి దగ్గర ఆ నటుడి ఫోన్ నెంబర్