Share News

Today Gold Rate: దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..

ABN , Publish Date - Jun 03 , 2025 | 07:29 AM

Today Gold Rate: పసిడికి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జూన్ నెల ప్రారంభంలోనే భారతదేశంలో బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగాయి.

Today Gold Rate: దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..
Today Gold Rate

Business News: పసిడికి (Gold) మార్కెట్లో (Market) ఎల్లప్పుడూ డిమాండ్ (Demand) ఉంటుంది. అయితే పసిడి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జూన్ నెల ప్రారంభంలోనే భారతదేశంలో బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య పెరిగిన ఉద్రిక్తతలు అలాగే యుఎస్-చైనా మధ్య టారీఫ్ వార్‌తో బంగారం ధరలపై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. ఈ క్రమంలో పసిడి ధరలు అమాంతం పెరుగుతూ వచ్చింది. మంగళవారం కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది.


భారతదేశంలో బంగారం ధరలు..

ప్రస్తుతం 100 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు రూ.9,88,400 గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ.9,06,000.. 18 క్యారెట్లు రూ.7,41,300గా ఉంది. అదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు రూ.98,840.. 22 క్యారెట్లు రూ.90,600.. 18 క్యారెట్లు రూ.74,130గా ఉన్నాయి.

హైదరాబాద్‌లో బంగారం ధరలు..

నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,850.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,610.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74,140గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


దేశవ్యాప్తంగా బంగారం (24, 22 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..

  • కోల్‌కతా- రూ.98,850, రూ.90,610

  • చెన్నై- రూ.98,850, రూ.90,610

  • బెంగళూరు- రూ.98,850, రూ.90,610

  • పుణె- రూ. 98,850, రూ.90,610

  • అహ్మదాబాద్- రూ. 98,900, రూ.90,660

  • భోపాల్- రూ. 98,900, రూ.90,660

  • కోయంబత్తూర్- రూ. 98,850, రూ.90,610

  • పట్నా- రూ. 98,900, రూ.90,660

  • సూరత్- రూ. 98,900, రూ.90,660

  • పుదుచ్చెరి- రూ. 98,850, రూ.90,610


వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 1,11,100గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండికి రూ. 100 పెరిగి. రూ.1,00,100కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండికి రూ. 100 పెరిగి. రూ.1,00,100 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో కేజీ ధర రూ.1,11,100గా ఉంది, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,11,100 వద్ద కొనసాగుతోంది.


బంగారం స్వచ్ఛమైనదా కాదా, ఇలా చెక్ చేయండి..

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్ మార్కులను ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి 9 శాతం ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 22 క్యారెట్ల బంగారం 0.916 స్వచ్ఛతను కలిగి ఉండాలి (22/24 = 0.916). 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంలో ఎలాంటి కల్తీ ఉండదు.


ఈ వార్తలు కూడా చదవండి..

తహసీల్దార్‌ కుటుంబం సేఫ్‌

చచ్చేవారికి సిరప్‌ ఎందుకు?

For More AP News and Telugu News

Updated Date - Jun 03 , 2025 | 07:45 AM