Share News

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:53 AM

బంగారం ధర ఇవాళ(గురువారం) భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది.

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..
Gold

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీపావళి సమయంలో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర, ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాల వల్ల పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గత రెండు వారాల్లో పసిడి ధర భారీగా తగ్గింది. ఈ క్రమంలో బంగారం ధర ఇవాళ(గురువారం) కూడా భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. భారత్‌లో నిన్న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,22,400 ఉంది. ఇవాళ రూ.1,910 మేర తగ్గి రూ.1,20,490 చేరింది. దీంతో పసిడి ప్రియులు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.


హైదరాబాద్‌లో బంగారం ధరలు..

  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,20,490

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,10,450

  • 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹90,370

విజయవాడలో బంగారం ధరలు..

  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,20,490

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,10,450

  • 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹90,370


బెంగళూరులో బంగారం ధరలు..

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,20,490

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,10,450

18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹90,370

బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.


ఇవి కూడా చదవండి..

Home Minister Amit Shah: పీఎం, సీఎం..రెండు పదవులూ ఖాళీ లేవు

Former Bangladesh PM Sheikh Hasina: భారత్‌లో స్వేచ్ఛగా ఉన్న..బంగ్లాదేశ్‌కు వెళ్లే ఉద్దేశం లేదు

Updated Date - Oct 30 , 2025 | 12:07 PM