Gold Rate: తగ్గేదేలే అంటున్న బంగారం.. మూడో రోజూ జంప్.. ఇవాళ్టి ధరలు ఇవే
ABN , Publish Date - Feb 07 , 2025 | 08:22 AM
దేశంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొండెక్కుతున్న ధరలతో ఊహకు అందనంత వేగంగా సరికొత్త రికార్డులకు చేరుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు.. పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం ధర శర వేగంతో దూసుకుపోతోంది.

ABN Internet: దేశంలో బంగారం ధరలు (Gold Rate) రోజురోజుకు పెరుగుతున్నాయి. (Increases) కొండెక్కుతున్న ధరలతో ఊహకు అందనంత వేగంగా సరికొత్త రికార్డులకు చేరుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు.. పెళ్లిళ్ల సీజన్ (Wedding Season) మొదలు కావడంతో బంగారం ధర శర వేగంతో దూసుకుపోతోంది. ధరలు ఎప్పటికప్పుడు రికార్డు స్థాయికి చేరుతున్నప్పటికీ.. బంగారం కొనుగోలు విషయంలో జనాలు ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇటీవల రూ. 86 వేల పైకి చేరిన బంగారం ధర ఆ తర్వాత కూడా స్థిరంగా పెరుగుతూనే ఉంది. తాజాగా రూ. 87 వేలు దాటింది.
ఈ వార్త కూడా చదవండి..
పోలీస్ విచారణకు రాంగోపాల్ వర్మ
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.87,400 వేలు ఉండగా.. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.80 వేలుగా నమోదైంది. వెండి ధర ఐదు రోజుల తరువాత పెరిగింది. ఇవాళ కిలో వెండి రూ. 97,302 వద్ద కొనసాగుతోంది.
పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. అంతేకాదు.. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
కొనుగోలు దారుల ఆందోళన..
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధర, నగలు కొనుగోలు చేసే వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. అంతేకాదు బంగారం ధర బడ్జెట్ అనంతరం మరింత భారీగా పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర చరిత్రలో మొదటిసారిగా రూ. 87 వేలు దాటింది. ధరల పెరుగుదల ఇలానే కంటిన్యూ అయితే.. అతి త్వరలోనే లక్ష రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోందని నిపుణులు అంచనా .
ఈ వార్తలు కూడా చదవండి..
విలువల గురించి జగన్ మాట్లాడటం...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News