Share News

Gold Overdraft Loan: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్‌ లోన్ తీసుకోవచ్చని మీకు తెలుసా?

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:19 AM

ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం చాలా మంది చేస్తుంటారు. అవే బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా బ్యాంకులు కల్పిస్తాయని మీకు తెలుసా. ఇది పర్సనల్ లోన్ వలే కాకుండా , ఒక క్రెడిట్ లైన్‌లాగా పనిచేస్తుంది.

Gold Overdraft Loan: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్‌ లోన్ తీసుకోవచ్చని మీకు తెలుసా?
Gold Overdraft Loan

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా బ్యాంకుల నుంచి తీసుకునే గోల్డ్ లోన్‌లో ఒకేసారి మొత్తం డబ్బు తీసుకుని దానిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయంలో మీ బంగారు ఆభరణాల విలువను బట్టి బ్యాంక్ నిర్దిష్ట పరిమితితో రుణాన్ని మంజూరు చేస్తుంది. వినియోగదారుడు ఈ పరిమితి నుంచి అతనికి అవసరమైన మేరకు ఎప్పుడైనా, ఎంతైనా డబ్బును డ్రా చేసుకోవచ్చు.


ఇక్కడ మీరు విత్ డ్రా చేసుకున్న అసలు మొత్తంపై మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మంజూరైన మొత్తం పరిమితిపై కాదు. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఈ రుణాలు చెల్లుబాటు అవుతాయి. మీ సౌలభ్యాన్ని బట్టి రుణం తిరిగి చెల్లిస్తుండవచ్చు మళ్లీ తీసుకోనూవచ్చు.


బంగారం మీద ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందడానికి కొన్ని ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా 18 క్యారెట్ల నుంచి 24 క్యారెట్ల మధ్య స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలపై బ్యాంకులు ఓడీ సౌకర్యం ఇస్తాయి. వినియోగదారుడికి కావలసిన రుణ పరిమితిని బట్టి తగినంత బరువున్న బంగారాన్ని బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విలువలో 70 నుంచి 75 శాతం వరకు ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని మంజూరు చేస్తారు.


ఓడీ మీద వడ్డీ రోజువారీగా లెక్కిస్తారు. బ్యాంకును అనుసరించి సంవత్సరానికి 8 నుంచి 15 శాతం మధ్య ఈ వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజు సాధారణంగా మంజూరైన మొత్తం ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిలో 0.5% నుంచి 1.5% వరకు ఉండే అవకాశం ఉంది.


ఫెడరల్ బ్యాంక్ డిజి గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీం, సీఎస్‌బీ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ గోల్డ్ లోన్ స్కీమ్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB) టీఎంబీ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు ఆభరణాలపై ఎస్ఓడీ అందుబాటులో ఉన్నాయి. పైన ఉదహరించిన బ్యాంకులు తమ ఖాతాదార్లకు ఓడీ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2025 | 11:19 AM