Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..
ABN , Publish Date - Jun 06 , 2025 | 06:15 AM
Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,300 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,600 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,700 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. గత నెల రోజుల నుంచి ప్రతీ రోజూ బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. మే మొదట్లో 24 క్యారెట్ల బంగారం ధర 96 వేల దగ్గర ట్రేడ్ అయింది. ఇప్పుడు 99 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇంకో వారంలో లక్షకు చేరువయ్యే అవకాశం ఉంది. బంగారం కొనాలనుకునే పేద, మధ్య తరగతి కుటుంబాలు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తోంది. శుభకార్యాలకోసం బంగారం కొనాలనుకునే వారు ధరలు తగ్గుతాయని ఎదురుచూడకపోవటం మంచిదని ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..
భాగ్య నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,300 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,600 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,700 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,610 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,310 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,710 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
భాగ్యనగరంలో వెండి ధరలు..
నెల రోజుల క్రితం వరకు వెండి ధరలు ప్రతీనిత్యం తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు బంగారంతో పాటు పెరుగుతూ పోతున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 10,400 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,04,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 10,410 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,04,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి