Gold And Silver Rate: పసిడి ప్రియులకు అలర్ట్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:47 AM
Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,200 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,680 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,260 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

బంగారం ధరలకు మరో సారి రెక్కలు వచ్చాయి. తగ్గుతోంది కదా అని సంతోషపడేలోపు.. ఊహించని షాక్ ఇచ్చాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర మళ్లీ లక్ష దాటింది. పది రోజుల క్రితం 96 నుంచి 97 వేల రూపాయల మధ్య ట్రేడ్ అయింది. రెండు, మూడు రోజుల్లో సీన్ మొత్తం మారిపోయింది. ఒక్కసారిగాపైకి ఎగబాకింది. బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. 22 క్యారెట్ల బంగారం కూడా 90 వేల రూపాయల పైన ట్రేడ్ అవుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..
భాగ్య నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,200 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,680 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,260 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. ఇక, ఈ రోజు బంగారం ధరలు పెరగలేదు.. తగ్గలేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,680 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,200 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 76,260 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
నగరంలో వెండి ధరలు ..
నెల రోజుల క్రితం వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ, గత 10 రోజుల నుంచి వెండి ధరలు కూడా అనుకోని షాక్ ఇస్తున్నాయి. పెరుగుతూ పోతున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,000 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు వెండి ధరలు పెరగలేదు. తగ్గలేదు. 100 గ్రాముల వెండి ధర నేడు 12,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
సిందూర్‌కు వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్