Share News

Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

ABN , Publish Date - Jun 13 , 2025 | 06:38 AM

Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,280 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,600 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
Gold And Silver Rate

బిజినెస్ డెస్క్: ఆడవాళ్లకు బంగారానికి వేల ఏళ్ల నుంచి అవినాభావ సంబంధం ఉంది. అందుకే బంగారం ఎంత ఉన్నా.. ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇక, భారతీయ సంస్కృతిలో భాగంగా మాత్రమే కాకుండా పెట్టుబడి మార్గంగానూ బంగారం ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పసిడిపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. అందుకే బంగారం ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. మొన్నటి వరకు రూ.97 వేల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన గోల్డ్ ధర ఇప్పుడు మళ్లీ పుంజుకుని రూ.99 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం కొనాలనుకునే వారికి షాక్ ఇస్తోంది.


హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..

భాగ్య నగరంలో నిన్న(గురువారం) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,280 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,600 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,290 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,010 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,610 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.


నగరంలో వెండి ధరలు ఇలా ..

10 రోజుల క్రితం వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ, 10 రోజులుగా ప్రతీరోజూ రోజు వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. బంగారం ధరలు తగ్గిన సమయంలోనూ వెండి ధరలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 11,890 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,18,900 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. 100 గ్రాముల వెండి ధర నేడు 11,880 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,18,800 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

ఈ విస్తరణలోనూ ముస్లింలకు నిరాశే

వర్సిటీల ప్రక్షాళన ఇలా మొదలుకావాలి

Updated Date - Jun 13 , 2025 | 02:54 PM