Share News

Gold And Silver Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధరలు

ABN , Publish Date - Jun 10 , 2025 | 06:49 AM

Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,690 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,550 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,270 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

Gold And Silver Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధరలు
Gold And Silver Rate

నెల రోజుల క్రితం వరకు కొనుగోలుదారులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా తగ్గతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు భారీగా తగ్గింది. 97 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. భవిష్యత్తులో మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..


హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్ మహా నగరంలో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,690 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,550 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,270 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,680 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ధర 89,540 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,260 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.


వెండి ధరలు ఇలా ..

గత నెలలో బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ, జూన్ ప్రారంభం నుంచి బంగారం తగ్గతూ ఉంటే.. వెండి ధరలు అనుకోని షాక్ ఇస్తున్నాయి. పెరుగుతూ పోతున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 10,800 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,08,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 10,810 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,08,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

మలబద్ధకం మతలబు

యువతుల్లో గుండెపోట్లు ఎందుకు

Updated Date - Jun 10 , 2025 | 06:49 AM