Google Pay: గూగుల్ పే ద్వారా రూ.12 లక్షల వరకు లోన్స్.. ఇలా ఈజీగా అప్లై చేసుకోండి..
ABN , Publish Date - Apr 30 , 2025 | 03:35 PM
ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర ఖర్చులతో అనేక మంది కూడా ఆర్థిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో లోన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి సందర్భాల్లో గూగుల్ పే (GPay) ద్వారా ఈజీగా రూ.12 లక్షల వరకు లోన్స్ తీసుకునే ఛాన్సుంది. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం.

ప్రస్తుత జీవనశైలిలో అనేక మందికి ఆర్థిక అవసరాలు క్రమంగా పెరుగుతున్నాయి. సేవింగ్స్ చేసే ధోరణి క్రమంగా తగ్గుతోంది. ఇలాంటి క్రమంలో ఏదైనా పెద్ద మొత్తంలో నగదు కావాలంటే లోన్స్ కోసం అనేక యాప్స్ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారికి గూగుల్ పే (GPay) ఈజీగా లోన్స్ అందిస్తోంది. రూ.30,000 నుంచి రూ.12 లక్షల వరకు లోన్లు తీసుకునే అవకాశం ఇస్తోంది. అయితే గూగుల్ పే నేరుగా రుణాలను అందించదు. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా తక్షణ వ్యక్తిగత రుణాలను అందిస్తోంది.
వడ్డీ రేటు 10.50% నుంచి
ఈ క్రమంలో బ్యాంకు శాఖల చుట్టూ తిరిగే పనిలేకుండా గూగుల్ పే ద్వారా ఈజీగా లోన్స్ తీసుకోవచ్చు. తక్కువ డాక్యుమెంటేషన్‌తో వీటిని ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. ఈ రుణాలు ప్రత్యేకంగా తక్షణ అవసరాల కోసం రూపొందించబడ్డాయి. పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, టూర్లు లేదా అప్పటికప్పటి ఖర్చులు ఏవైనా కావచ్చు. మీరు Google Pay నుంచి రుణం తీసుకుంటే 10.50% నుంచి 15% వరకు వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. మీ క్రెడిట్ స్కోరు ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది.
ఈ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు
మీరు భారతదేశ పౌరులై, Google Payని ఉపయోగిస్తూ ఉండాలి. లోన్ పొందడానికి, మీ CIBIL స్కోరు బాగుండాలి. వ్యక్తిగత రుణం పొందడానికి, మీ వయస్సు 21 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల మధ్య ఉండాలి. పర్సనల్ లోన్ పొందడానికి, మీకు సొంత బ్యాంక్ ఖాతా కల్గి ఉండాలి.
పర్సనల్ లోన్ కోసం అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, గత 3 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడి మొదలైనవి అవసరం
రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి
Google Pay యాప్ తెరిచి, మనీ ట్యాబ్‌కు వెళ్లండి
లోన్స్ విభాగంలో అందుబాటులో ఉన్న ఆఫర్లను చూడండి
అందుబాటులో ఉన్న ఆఫర్‌పై నొక్కి, సూచనలను అనుసరించండి
ఆ తర్వాత KYC పత్రాలను అప్‌లోడ్ చేయండి,
రుణ ఒప్పందాలపై ఇ సంతకం చేయండి
లోన్ ఆమోదం పొందిన తర్వాత మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది
రుణం తిరిగి చెల్లింపు ప్రక్రియ
Google Pay ద్వారా రుణం నెలవారీ EMI మీ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా తీసివేయబడుతుంది. అందువల్ల, జరిమానాను నివారించడానికి తగిన సమయంలో చెల్లింపులు చేసుకోవాలి. రుణ దరఖాస్తు సమయంలో గడువు తేదీలు, మొత్తాలతో సహా తిరిగి చెల్లించే షెడ్యూల్ కూడా ప్రకటిస్తారు. రుణం తీసుకునే ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. ఎటువంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. రుణం తీసుకునే వ్యక్తి వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. అలాగే క్రమం తప్పకుండా ఆదాయ వనరును కలిగి ఉండటం చాలా ముఖ్యం.
ఇవి కూడా చదవండి:
RRBs: ఈ 15 బ్యాంకులు మే 1 నుంచి బంద్.. మీ డబ్బు భద్రమేనా..
Central Government: జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Read More Business News and Latest Telugu News