Share News

Financial Bids For IDBI : ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల విక్రయానికి అక్టోబరులో ఆర్థిక బిడ్స్‌

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:30 AM

ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని త్వరితగతిన పూర్తి చేయటానికి ప్రభుత్వం

Financial Bids For IDBI : ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల విక్రయానికి అక్టోబరులో ఆర్థిక బిడ్స్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని త్వరితగతిన పూర్తి చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బ్యాంక్‌లో వాటాల విక్రయానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో ఆర్థిక (ఫైనాన్షియల్‌) బిడ్స్‌ను ఆహ్వానించనున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) కార్యదర్శి అరుణిష్‌ చావ్లా వెల్లడించారు. విజయవంతమైన బిడ్డర్‌ను వచ్చే ఏడాది మార్చిలో ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఆసక్తి కలిగిన సంస్థలతో ఇప్పటికే ప్రాథమిక చర్చల ప్రక్రియ పూర్తయిందని, మూడో త్రైమాసికంలోనే బిడ్స్‌ను ఆహ్వానించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. విజయవంతమైన బిడ్డర్‌ను ఎంపిక చేసిన అనంతరం అనుమతుల కోసం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కు పంపించనున్నట్లు చావ్లా తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్‌లో మొత్తం 60.72 శాతం వాటాల విక్రయానికి సంబంధించి ప్రభుత్వం, భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ).. అక్టోబరు 2022లో ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను ఆహ్వానించాయి.


ఇవి కూడా చదవండి

తప్పతాగి డ్యూటీకి.. అడ్డంగా జనానికి దొరికిపోయిన ఎస్ఐ

మాజీ క్లర్క్ అవినీతి దందా.. 15వేల జీతం.. 30 కోట్ల ఆస్తులు

Updated Date - Aug 02 , 2025 | 03:30 AM