EPFO alert: గుడ్‌న్యూస్.. ఆటో సెటిల్‌మెంట్ లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచిన ఈపీఎఫ్‌ఓ..
ABN , Publish Date - Jun 24 , 2025 | 08:37 PM
ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్. ముందస్తు ఉపసంహరణకు సంబంధించి ఆటో సెటిల్‌మెంట్ పరిధిని పెంచుతూ ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటో సెటిల్‌మెంట్ పరిధిని తాజాగా ఈపీఎఫ్‌ఓ సవరించింది. ఇప్పటివరకు ఉన్న లక్ష రూపాయల ఆటో సెటిల్‌మెంట్ పరిధిని రూ.5 లక్షలకు పెంచింది.

ఈపీఎఫ్‌ఓ (EPFO) చందాదారులకు గుడ్‌న్యూస్. ముందస్తు ఉపసంహరణకు సంబంధించి ఆటో సెటిల్‌మెంట్ పరిధిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటో సెటిల్‌మెంట్ (EPFO Auto settlement) పరిధిని తాజాగా సవరించింది. ఇప్పటివరకు ఉన్న లక్ష రూపాయల ఆటో సెటిల్‌మెంట్ పరిధిని రూ.5 లక్షలకు పెంచింది (EPFO Auto settlement limit). ఈ నేపథ్యంలో రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లు త్వరతగతిన సెటిల్ కాబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటన విడుదల చేశారు.
ఆటో సెటిల్‌మెంట్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సమయంలో తీసుకొచ్చింది. ఆటో సెటిల్‌మెంట్ అంటే మానవ ప్రమేయం లేకుండానే ఐటీ వ్యవస్థ సహాయంతో క్లెయిమ్‌ను పరిష్కరించే వెసులుబాటు. వివాహం, విద్య, ఇంటి కొనుగోలు కోసం ఈపీఎఫ్‌ఓ ఆటో సెటిల్‌మెంట్‌ను కేంద్రం ప్రకటించింది. అయితే ఈ ఆటో సెటిల్‌మెంట్ పరిధి ఇప్పటివరకు లక్ష రూపాయల వరకు మాత్రమే ఉండేది. ఇకపై ఆ పరిధి రూ.5 లక్షలు కాబోతోంది. దీని వల్ల ఈపీఎఫ్‌ఓ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని కార్మిక శాఖ మంత్రి అభిప్రాయపడ్డారు.
ఆటో సెటిల్‌మెంట్ అనేది ఐటీ వ్యవస్థతో అనుసంధానం అయి పని చేస్తుంది. చందాదారుల కేవైసీ, బ్యాంక్ వ్యాలిడేషన్ పూర్తయినట్టైతే పేమెంట్ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అయిపోతుంది. దీని వల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది కేవలం 3-4 రోజుల్లోనే పూర్తయిపోతుంది. అంటే ఇకపై ఐదు లక్షల రూపాయల వరకు సెటిల్‌మెంట్ కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. వైద్య ఖర్చుల కోసం, ఉన్నత విద్య, పెళ్లి కోసం, ఇంటి నిర్మాణం కోసం ఈ ఆటో సెటిల్‌మెంట్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి